హిజ్రా చేతిలో శిశువు మృతి.. డబ్బుకోసం దారుణం...

By AN TeluguFirst Published Nov 20, 2021, 3:43 PM IST
Highlights

 ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ. 500 ఇస్తానన్నా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీని అరెస్ట్ చేశారు. 

పశ్చిమబెంగాల్ : చంటిబిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ Hijra..డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్ చేసింది. చివరకు,  హిజ్రా ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఈ విషాదం జరిగింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్ దంపతులకు అక్టోబర్ 29న ముగ్గురు Children పుట్టారు. గత బుదవారం (నవంబర్ 17న) మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్ ఇంటికి వెళ్లారు. 

పిల్లలకు Blessingలు అందిస్తామంటూ రూ.5వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమనడంతో కుటుంబసభ్యులతో వాదనకు దిగారు. అంతలోనే ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ. 500 ఇస్తానన్నా వినిపించుకోలేదు.

శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని తల్లి బోరుమంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీని అరెస్ట్ చేశారు. 

కాగా, ఇంటిముందు టెంటు ఉన్నా, ఏదైనా శుభకార్యం జరుగుతుందన్న విషయం చూచాయగా తెలిసినా హిజ్రాల వేధింపులు మామూలే..ఏ శుభకార్యం అయినా హిజ్రాలు వాలిపోతారు. ఈనాం పేరుతో సతాయించడం అందరికీ అనుభవమైన విషయమే. కొన్నిసార్లు ఈ వేధింపులు ఎక్కువై గొడవలకు దారి తీయడమూ తెలిసిందే. అలాంటి  ఓ దారుణ ఘటనే గుంటూరులోని వెంకటాద్రి పేటలో ఆగస్టులో జరిగింది. 

గుంటూరులో చందన అనే హిజ్రా ఆగస్ట్ 16న హత్యకు గురైంది. చందన తన వెంటపడి వేధిస్తుండడంతో అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. రోకటిబండతో హిజ్రాను తలమీద గట్టిగా కొట్టాడు. తలమీద బలమైన గాయం కావడంతో చందన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.  

సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ సెకండ్.. లాస్ట్‌లో యూపీ, బిహార్‌లు

ఇక ఈ యేడాది జులై చివర్లో జరిగిన మరో సంఘటనలో ఓ హిజ్రా మోసపోయింది. హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో యువతి హిజ్రాగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ.. మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. 

శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమయింది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు. యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది.

ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్భంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 
 

click me!