‘ఎవరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. ఎప్పుడూ ఆశను వీడొద్దు’.. వైరల్ అవుతున్న వరుణ్ సింగ్ లెటర్..

Published : Dec 11, 2021, 01:17 PM ISTUpdated : Dec 11, 2021, 02:02 PM IST
‘ఎవరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. ఎప్పుడూ ఆశను వీడొద్దు’.. వైరల్ అవుతున్న వరుణ్ సింగ్ లెటర్..

సారాంశం

ఎంచుకున్న వృత్తిలో రాణించే వరకు వరుణ్ సింగ్ కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెబుతూ.. తాను చదివిన  ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కు సెప్టెంబర్ లో  వరుణ్ ఓ లేఖ రాశారు.  తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో Helicopter crash నేపథ్యంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది.  

ఢిల్లీ :  ‘మీరు ఎవరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏమిటో గుర్తించండి.. దేని కోసం పనిచేసిన మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి..’ జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న Group Captain Varun Singh మనసు నుంచి వచ్చిన స్ఫూర్తిదాయక వ్యాఖ్యలివి.

ఎంచుకున్న వృత్తిలో రాణించే వరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెబుతూ.. తాను చదివిన Army Public School ప్రిన్సిపాల్ కు సెప్టెంబర్ లో  వరుణ్ ఓ లేఖ రాశారు.  తాము సాధారణం అని భావించే Studentsలో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో Helicopter crash నేపథ్యంలో ఈ letter ప్రస్తుతం viralగా మారింది.  

‘నేను చదువులో చాలా సాధారణ విద్యార్థిని. పన్నెండవ తరగతి లో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందాను. చదువు ఒక్కటే కాదు... ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా  అంత చురుగ్గా ఉండేవాడిని కాదు.  కానీ, నాకు Planes, aviation గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తిగా ఉండేది.  అయితే నేను సాధారణ వ్యక్తిని.. గొప్పగా చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదనే న్యూనతతో ఉండేవాడిని. 

Haryana CM: అక్క‌డ న‌మాజ్ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ స‌హించం.. హర్యానా సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

కానీ ఎప్పుడైతే Flight Squadron లో యంగ్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ గా ఎంపికయ్యానో.. అప్పటినుంచి నా ఆలోచన మారింది. నేను మనసు పెట్టి పని చేస్తే... గొప్పగా చేయగలం అని అర్థం అయింది. అంతే వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు మొదలయ్యాయి’ అంటూ వరుణ్ తన అనుభవాలను వివరించారు.

అక్కడినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. చాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్నారు. కఠినమైన ప్రయోగాత్మక Test pilot courseకు ఎంపికయ్యారు. చివరకు, ఆయన సీనియార్టీ మార్క్ దాటినప్పటికీ, తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్ లో పోస్టింగ్ పొందారు. ఆయన విజయాలు అక్కడితో ఆగలేదు. ఇస్రో చరిత్రలో  మేకింగ్ గగన్ యాన్ ప్రోగ్రాం కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన నా తొలి జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు.

తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలతో తాను వెనకడుగు వేయాల్సి వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు. ‘జీవితంలో నువ్వు సాధించే విజయాలను 12వ తరగతిలో  వచ్చే మార్కులు నిర్ణయిస్తాయని అనుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము. ఆ దిశగా పనిచేయి’ అంటూ తన లేఖను ముగించారు వరుణ్ సింగ్.

డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో వరుణ్ సింగ్ మినహా మిగతా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.  మృతుల్లో cds bipin rawat, ఆయన సతీమణి కూడా ఉన్నారు.  ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారిక వర్గాల సమాచారం. 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?