గోవాలో ఓషో మెడిషన్ సెంటర్ కు వచ్చిన నేపాల్ మేయర్ కూతురు తప్పిపోయారు. గత సోమవారం రాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయారు. కూతురును వెతికిపెట్టాలని తండ్రి సోషల్ మీడియా ద్వారా గోవాలో ఉంటున్న వారిని అభ్యర్థించారు.
నేపాల్ మేయర్ కుమార్తె గోవాలో కనిపించకుండా పోయింది. 36 ఏళ్ల వయస్సున్న ఆర్తి హమాల్ ఓషో ధ్యానాన్ని అనుసరిస్తోందని, ఆమె చివరి సారిగా సోమవారం రాత్రి కనిపించిందని తండ్రి గోపాల్ హమాల్ వెల్లడించారు. ‘ఆర్తి హమాల్ చివరిసారిగా సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో అశ్వెం బ్రిడ్జి పరిసరాల్లో కనిపించింది. ఆమె గత కొన్ని నెలలుగా ఓషో మెడిటేషన్ సెంటర్ తో సంబంధం కలిగి ఉన్నారు’’ అని నేపాలీ వార్తాపత్రిక ‘హిమాలయన్ టైమ్స్’ తెలిపింది.
గోపాల్ హమాల్ ధంగాడి సబ్ మెట్రోపాలిటన్ నగర మేయర్ గా ఉన్నారు. తన కూతురును కనిపెట్టడంలో సాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్తి కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె స్నేహితుడు తమకు సమాచారం అందించారని ఆయన వెల్లడించారు.
While the Indian and Nepali authorities do the needful search op, our prayers to Lord Pashupatinath for Ms Aarti Hamal. 🙏 https://t.co/2p18Mflosj
— Navita Srikant (@NavitaSrikant)
‘‘నా పెద్ద కుమార్తె ఆర్తి, ఆమె ఓషో మెడిటేటర్. ఆమె కొన్ని నెలలుగా గోవాలో నివసిస్తోంది. అయితే నిన్నటి నుంచి ఆర్తి జోర్బా వైబ్స్ అష్వెమ్ బ్రీజ్ తో సంబంధాలు తెగిపోయాయని ఆమె స్నేహితురాలి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. గోవాలో ఉంటున్న వారు నా కుమార్తె ఆర్తిని వెతికిపెట్టడంలో సాయం చేయాలని వినమ్రంగా కోరుతునున్నాను.’’ అని ట్వీట్ చేశారు.
అలాగే, తన చిన్న కూతురు అర్జూ, అల్లుడు తమ ఆర్తిని వెతుక్కుంటూ గోవా వెళ్తున్నారని తెలిపారు. తన కుమార్తె ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే మీరు 9794096014 / 8273538132 / 9389607953 సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో గోవా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.