2024 ఎన్నికలకు బీజేపీ ఫార్ములా ఇదే.. టార్గెట్ 350 మిషన్‌లో వెనుకపడిన మంత్రులకు అమిత్ షా వార్నింగ్

By Mahesh KFirst Published Sep 8, 2022, 2:16 AM IST
Highlights

బీజేపీ పార్టీ 2024 కోసం మేధోమథన సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ స్ట్రాటజిస్ట్ అమిత్ షాలు కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. వారికి కేటాయించిన టాస్కులను పూర్తి చేయకపోవడంపై క్లాసు తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మంత్రులకు కేటాయించిన టాస్కుల్లో కొందరు నిర్లక్ష్యం చూపినట్టు తెలుస్తున్నది. వారికి కేటాయించిన టాస్కులు పూర్తి చేయలేదు. నిన్న నిర్వహించిన  మేధోమథన సమావేశంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, చీఫ్ స్ట్రాటజిస్ట్ అమిత్ షాలు కేంద్రమంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారికి కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించకపోవడాన్ని, పర్యటించి అక్కడ రెక్కీ పట్టకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

‘మనం ఇక్కడ ఆర్గనైజేషన్ వల్లనే ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆర్గనైజేషన్ వల్లనే ఉన్నది. అలాంటి ఆర్గనైజేషన్‌కు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి’ అని మంత్రులకు వారు స్పష్టంచ చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులర్ లీడర్. ఎవరైనా ఆయన పేరు మీద ఎన్నికలు గెలువొచ్చు. కానీ, ఒక వేళ ఆర్గనైజేషనే గ్రౌండ్‌లో లేకుంటే తాము ఈ అడ్వాంటేజీని పొందలేము’ అని వారికి వివరించినట్టు తెలిసింది.

2024 ఎన్నికల కోసం బీజేపీ ప్రధానంగా స్వల్ప మార్జిన్లతో పార్టీ ఓడిపోయిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గాలు మంత్రుల మధ్య విభిజించి వారికి కేటాయించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో ఆ మంత్రులు తరుచూ పర్యటించాలని, అక్కడి స్థానిక సమాచారాన్ని వీలైనంత మేరకు ఎక్కువగా సేకరించాలని వివరించారు.

2024 ఎన్నికల కోసం బీజేపీ 350 సీట్ల లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. 20 నెలల ముందు నుంచే ప్లాన్లు వేస్తున్నది. 2019లో నష్టపోయిన సీట్లను ఫలవంతం చేయాలని, తద్వార బీజేపీ స్వల్ప మార్జిన్లతో పరాజయం పాలైన 144 సీట్లలో 50 శాతం, కనీసం 70 సీట్లను గెలువాలని ఆదేశించారు.

2014 ఎన్నికల్లో ఓడిపోయిన సీట్ల టార్గెట్‌ను 2019లో బీజేపీ తీసుకుంది. ఇలా టార్గెట్ చేసుకున్న సీట్లలో 30 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ టార్గెట్‌ను ఈ సారి మరింత పెంచారు. స్వల్ప మార్జిన్లతో ఓడిపోయిన వాటిలో 50 శాతం సీట్లు గెలుచుకోవాలని ఆదేశించారు. 

2019 ఎన్నికల్లో 543 లోక్‌సభ సీట్లల్లో 303 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మిగిలిన సుమారు 100 సీట్లల్లో 53 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా లబ్దిదారులు పొందిన సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాల లబ్దిదారులను ‘సరల్’ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. లబ్దిదారుల సంఖ్యను కూడా రిపోర్ట్ చేయాలని తెలిపారు.

బలమైన ఆర్గనైజేషన్, పీఎం మోడీ ఛరిష్మా.. ఇవి రెండే 2024 విన్నింగ్ ఫార్ములా అని అమిత్ షా అన్నట్టు కొన్ని వర్గాలు జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి తెలిపాయి.

click me!