న్యూఢిల్లీ: కరోనా కారణంగా నీట్ పరీక్షలను మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ: కరోనా కారణంగా నీట్ పరీక్షలను మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఆగష్టు 31కి ముందు పరీక్షలు నిర్వహించరు. మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.కరోనాపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా సోమవారం నాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బోధకుల పర్యవేక్షణలో స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు చికిత్స అందించే విధుల్లో ఉపయోగించుకోవాలని పీఎంవో తెలిపింది. బిఎస్సీ, జీఎన్ఎం ఉత్తీర్ణులైన నర్సులను సీనియర్ డాక్టర్లు, సీనియర్ నర్సుల పర్యవేక్షణలో కోవిడ్ నర్సింగ్ విధుల్లోకి తీసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలు ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా వాయిదా వేసింది కేంద్రం.
undefined
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దేశంలో ఇప్పటికే సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు రాష్ట్రాల యూనివర్శిటీలు పరీక్షలను రద్దు చేశాయి. చాలా రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. కరోనా కేసుల ఉధృతి ఇలానే ఉంటే పరీక్షలు నిర్వహించని విద్యార్థులను ప్రమోట్ చేసే అవకాశం ఉంది.