దేశంలో లాక్ డౌన్ ప్రజల సంక్షేమం కోసమే.. కేంద్రానికి సుప్రీం సూచన..!

By telugu news teamFirst Published May 3, 2021, 11:16 AM IST
Highlights

కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోందని... ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దేశంలో లాక్ డౌన్  విధించడంలో తప్పేమీ లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. తాజాగా.. సుప్రం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో సలహా ఇచ్చింది. దేశంలో కరోనా విపరీతంగా విజృంభిస్తున్న సమయంలో.. లాక్ డౌన్ ప్రజల సంక్షేమం కోసమే అన్న విషయం గ్రహించాలని సూచించింది.

కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోందని... ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

జనాలు ఎక్కువగా గుమ్ముగూడే ప్రదేశాలు, సూపర్ స్ప్రైడ్ సంఘటలను నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహమ్మారిని అరికట్టేందుకు..ప్రజల సంక్షేమం కోసం లాక్ డౌన్ విధించినా తప్పులేదని.. ఆ దిశగా ఆలోచించాల్సిందిగా సూచించింది.

ఒక వేళ లాక్ డౌన్ విధించాల్సి వస్తే.. ముందుగానే దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పింది.

ఇదిలా ఉండగా.. దేశంలో ఆదివారం 3.92లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం 1.95కోట్ల మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. 33,49,644 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2.15లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

click me!