దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష: విద్యార్ధుల పాలిట శాపంగా ‘‘నిమిషం’’ నిబంధన

By Siva KodatiFirst Published Sep 12, 2021, 2:23 PM IST
Highlights

వైద్య కోర్సులలో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే నీట్ 2021 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అయితే ఒక నిమిషం నిబంధన విద్యార్ధుల పాలిట శాపంగా మారింది. ఆలస్యంగా వచ్చారంటూ హైదరాబాద్ నిజాం కాలేజ్ వద్ద నలుగురు విద్యార్ధులను లోపలికి అనుమతించలేదు నిర్వాహకులు. ఎంతగా బతిమలాడినా పరీక్షా కేంద్రంలోకి పంపించలేదు.

కాగా, పరీక్షకు రెండు రోజుల ముందు పరీక్షపేపర్ లీక్‌పై ఆరోపణలు సంచలనం రేపాయి. కానీ, ఆ ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. కరోనా కారణంగా పరీక్షను వాయిదా వేయాలని స్టూడెంట్లు చాన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న ప్రకటించిన షెడ్యూల్‌కే పరీక్ష జరుగుతున్నది. ఆదివారం తొలిసారిగా 13 భాషల్లో నీట్ జరగనుంది. ఈ పరీక్షకు సుమారు 16.1 లక్షల మంది హాజరవ్వనున్నట్టు అంచనా. నీట్ క్లియర్ చేసిన విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, ఇతర మెడికల్, డెంటల్ కోర్సులు చేయడానికి అర్హత సంపాదిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 202 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 

నిజానికి ఏప్రిల్ 18న ఈ పరీక్ష జరగాల్సింది. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తాజా షెడ్యూల్‌నూ ఇంకొంత కాలం వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. కానీ, వాయిదా వేయాలన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది

click me!