పీల్డ్ ఆస్పత్రులు పెట్టండి, మా సాయం తీసుకోండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

By telugu teamFirst Published Apr 24, 2021, 5:08 PM IST
Highlights

కోవిడ్ -19 తాజా వాక్సినేషన్ ప్రారంభమవుతున్న స్థితిలో ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకు వివిధ సంస్థలను వాడుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: ఫీల్డ్ ఆస్పత్రులు (క్షేత్ర ఆస్పత్రులు) పెట్టే ఆలోచన చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రభుత్వ పరిశోధన సంస్థలు లేదా ప్రైవేట్ రంగం సాయం తీసుకోవాలని వాటిని ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని చెప్పింది. మే 1వ తేదీ నుంచి తాజా కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అది అవసరమని చెప్పింది. 

మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు వయస్సు పైబడినవారందరికీ కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందు వల్ల క్షేత్ర ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇటీవల విడుదల చేసిన పలు మార్గదర్శకాలతో పాటు తాజాగా కేంద్రం ఈ సూచన చేసింది. 

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐ) వంటి సంస్థల సాయంతో పాటు ప్రైవేట్ రంగంలోని అటువంటి సంస్థల సాయం తీసుకుని ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సూచించింది. 

మిషన్ మోడ్ పద్ధతిలో మరిన్ని ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలను నమోదు చేసేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాలని సూచించింది. CoWIN వేదిక స్థిరపడిందని, లోపాలు లేకుండా పనిచేస్తోందని, మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వాక్సినేషన్ కు సంబంధించిన సంక్లిష్టతను నివారించడానకిి పనిచేస్తుందని కోవిడ్ -19పై ఏర్పాటైన టెక్నాలజీ, డేటా మేనేజ్ మెంట్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. 

click me!