అసోంను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. నిరాశ్ర‌యులైన 1.20 లక్షల మంది ప్రజలు

Published : Jun 22, 2023, 05:38 AM IST
అసోంను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. నిరాశ్ర‌యులైన 1.20 లక్షల మంది ప్రజలు

సారాంశం

Guwahati: అసోంను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా 20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. రోడ్డు వంతెన వద్ద బెకి నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అలాగే, ఎన్టీ రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా-ఎన్ హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమారి నది ఉగ్ర‌రూపంలో ప్రవహిస్తున్నాయి.  

Assam floods: ఈశాన్య భార‌త రాష్ట్రమైన అసోంను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా 20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. రోడ్డు వంతెన వద్ద బెకి నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అలాగే, ఎన్టీ రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా-ఎన్ హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమారి నది ఉగ్ర‌రూపంలో ప్రవహిస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. అసోంలోని 20 జిల్లాల్లోని దాదాపు 1.20 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) నివేదికల ప్రకారం, అస్సాం, ఇతర పొరుగు రాష్ట్రాలు-పొరుగు దేశం భూటాన్ లో కుండపోత వర్షాల కారణంగా, అనేక నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. రోడ్ బ్రిడ్జి వద్ద బెకి నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎన్టీ రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా, ఎన్ హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమారి నది ఉగ్ర‌రూపంలో ప్రవహిస్తున్నాయి.

బజలి, బక్సా, బార్పేట, బిశ్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రీ, దిబ్రూగఢ్, గోలాఘాట్, హోజై, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్పూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాల్లోని చాలా ప‌ట్ట‌ణాలు, గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. ఒక్క నల్బరి జిల్లాలోనే 44,707 మంది, బక్సాలో 26,571 మంది, లఖింపూర్ లో 25,096 మంది, తముల్పూర్ లో 15,610 మంది, బార్పేట జిల్లాలో 3,840 మంది వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రభావితమయ్యారని ఏఎస్డీఎంఏ వరద నివేదిక తెలిపింది.

జిల్లా యంత్రాంగం 14 సహాయ శిబిరాలు, 17 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు మంది బక్సా, ధుబ్రి, కోక్రాఝర్, నల్బరి, తముల్పూర్ జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. వరద ప్రభావిత జిల్లాల్లో వరదల్లో 1.07 లక్షలకు పైగా పెంపుడు జంతువులు, కోళ్లు ప్రభావితమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బుధవారం 1280 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. బుధవారం వరద నీరు 4 కరకట్టలు, 72 రోడ్లు, 7 వంతెనలను ధ్వంసం చేసింది.

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?