కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే.. ఈ సారి 400పైగా సీట్లు - ఒపీనియన్ పోల్..

By Sairam Indur  |  First Published Mar 15, 2024, 4:00 PM IST

కేంద్రంలో ముచ్చటగా మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ‘న్యూస్ 18’ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. బీజేపీ సొంతంగా 350 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇండియా కూటమి చతికిలపడుతుందని తెలిపింది.


కేంద్రంలో మరో సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం దిశగా పయనిస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు భారీ విజయం, ఇండియా కూటమికి ఎదురుదెబ్బ, టీఎంసీ, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేడీ తదితర ప్రాంతీయ పార్టీలకు సగటు కంటే తక్కువ ఫలితాలు వస్తాయని ‘న్యూస్ 18’ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 

‘న్యూస్ 18’ ఒపీనియన్ పోల్ 21 రాష్ట్రాల్లోని 518 లోక్ సభ నియోజకవర్గాల్లో లక్ష మందికి పైగా ప్రజలపై సర్వే నిర్వహించింది. అయితే మొత్తం 543 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీయేకు 411 సీట్లు వస్తాయని, బీజేపీ ఒంటరిగా 350 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. 

Latest Videos

ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలతో సహా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసి, పశ్చిమ బెంగాల్, దక్షిణ భారతదేశంలో గణనీయమైన విజయాలు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ కలిసి మరో 61 సీట్లను ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని అనుకుంటుంది. 

తమిళనాడులో 5, కేరళలో 2 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దక్షిణాదిలో బీజేపీ భారీ పురోగతి సాధిస్తుందని, పశ్చిమ బెంగాల్లో దాని సంఖ్యను 25 సీట్లకు పెంచుకుంటుందని, ఇది 2019 ప్రదర్శనతో పోలిస్తే కొంచెం ఎక్కువని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లో 77, మధ్యప్రదేశ్ లో 28, బీహార్ లో 38, జార్ఖండ్ లో 12, కర్ణాటకలో 25 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని, ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని మొత్తం 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది.

బీజేపీని బలీయమైన శక్తిగా చూడని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి మెరుగైన సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒడిశాలో 13, పశ్చిమ బెంగాల్లో 25, తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్ లో 8 స్థానాల్లో పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 

విపక్షాల కూటమి అయిన ‘ఇండియా’ మోడీపై ఎలాంటి ప్రభావమూ చూపదని తెలిపింది. ఆ కూటమికి కూడా తక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయని వెల్లడించింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ కేవలం 49 లోక్ సభ స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. అన్నాడీఎంకే, బీఎస్పీ, బీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు 27 సీట్లకు మించి గెలుచుకోలేదని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు దాదాపు 50 శాతం ఓట్లు వచ్చాయని సర్వేలో వెల్లడైంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్డీయేకు 57 శాతం ఓట్లు, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 26 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. మొత్తం 80 స్థానాలకు గాను బీజేపీ 77, మిగిలిన 3 స్థానాలను బీజేపీ కూటమి (2), మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ (1) గెలుచుకునే అవకాశం ఉంది. 

బీహార్లో బీజేపీ-జేడీయూ కూటమి 2019లో సాధించిన విజయాన్ని పునరావృతం చేస్తుందని, 40 స్థానాలకు గాను 38 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక్కడ కూడా ఎన్డీయే కూటమికి కనీసం 58 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీకి 28 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో బీజేపీ తొలిసారి ఖాతా తెరిచి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం 39 స్థానాలకు గాను డీఎంకే-కాంగ్రెస్ కూటమి 30 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2019 ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 38, అన్నాడీఎంకేకు 1 సీట్లు వచ్చాయి.

click me!