అమేథీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 15, 2024, 03:28 PM ISTUpdated : Mar 15, 2024, 03:30 PM IST
అమేథీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

1967లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట.  గాంధీ - నెహ్రూ కుటుంబానికి కంచుకోట ‘అమేథీ’.విద్యాధర్ భాజ్‌పాయ్, రవీంద్ర ప్రతాప్ సింగ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సతీశ్ శర్మ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ వంటి దిగ్గజాలు అమేథీ నుంచి ఎంపీలుగా పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహించారు. 1967లో ఏర్పడిన అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. అమేథీ లోక్‌సభ పరిధిలో టిలోయ్, సలోన్, జగదీష్ పూర్, గౌరీగంజ్, అమేథీ శాసనసభ స్థానాలున్నాయి. అమేథీలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,43,515 మంది. వీరిలో పురుషుల సంఖ్య 8,18,812 మంది.. మహిళలు 9,24,563 మంది. నెహ్రూ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్థాలుగా కంచుకోటగా వున్న అమేథీలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.  

దిగ్గజాలను భారతదేశానికి అందించిన గడ్డ.. గాంధీ - నెహ్రూ కుటుంబానికి కంచుకోట ‘అమేథీ’. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు అమేథీ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది. విద్యాధర్ భాజ్‌పాయ్, రవీంద్ర ప్రతాప్ సింగ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సతీశ్ శర్మ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ వంటి దిగ్గజాలు అమేథీ నుంచి ఎంపీలుగా పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహించారు. 

అమేథీ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. హేమాహేమీలకు పుట్టినిల్లు :

1967లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ పరిస్ధితిని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇక్కడి ఓటర్లు షాకిచ్చి.. కేంద్ర మంత్రి , బీజేపీ నేత స్మృతీ ఇరానీని గెలిపించారు. గతంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీని సైతం అమేథీ ప్రజలు ఓడించారు. ఎమర్జెన్సీతో పాటు రాజ్యాంగేతర శక్తిగా సంజయ్ తీరుపై భగ్గుమన్న ఓటర్లు జనతా పార్టీ అభ్యర్ధి రవీంద్ర ప్రతాప్ సింగ్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అప్పట్లో అమేథీ ఫలితం గాంధీ కుటుంబంతో పాటు యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురిచేసింది. లోక్‌దళ్ నేత శరద్ యాదవ్‌పై రాజీవ్ గాంధీ 2,37,696 ఓట్ల తేడాతో విజయం సాధించింది అమేథీ నుంచే. 

అమేథీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. గాంధీ కుటుంబానికి కంచుకోట :

1967లో ఏర్పడిన అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. రాయబరేలి, అమేథీ జిల్లాల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి వుంది. అమేథీ లోక్‌సభ పరిధిలో టిలోయ్, సలోన్, జగదీష్ పూర్, గౌరీగంజ్, అమేథీ శాసనసభ స్థానాలున్నాయి. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ లోక్‌సభ నియోజకర్గం పరిధిలోని ఐదు శాసనసభ స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించాయి. అమేథీలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,43,515 మంది. వీరిలో పురుషుల సంఖ్య 8,18,812 మంది.. మహిళలు 9,24,563 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీకి 4,68,514 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి రాహుల్ గాంధీకి 4,13,394 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 55,120 ఓట్ల మెజారిటీతో అమేథీని కైవసం చేసుకుంది. 

అమేథీ ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. పరువు నిలబెట్టాలని రాహుల్ :

నెహ్రూ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్థాలుగా కంచుకోటగా వున్న అమేథీలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పొగొట్టుకున్న చోటే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పావులు కదుపుతున్నారు. 2024లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని యూపీసీసీ చీఫ్ అజయ్ రాయ్ గతంలోనే ప్రకటించారు. గాంధీ కుటుంబం వారసత్వాన్ని నిలబెట్టడంతో పాటు స్మృతీ ఇరానీని ఓడించాలని రాహుల్ భావిస్తున్నారు. 

ఈ నియోజకవర్గం పరిధిలో సమాజ్‌వాదీ పార్టీ కూడా బలంగా వుండటంతో కాంగ్రెస్‌కు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా, ఇండియా కూటమిలో కుమ్ములాటలు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని స్మృతీ ధీమా వ్యక్తం చేస్తున్నారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?