NCRB: జైళ్లలో 4.83 లక్షల మంది .. 76 శాతం మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలే.. ఈ రాష్ట్రాల్లోనే అధికం..!

Published : Feb 04, 2022, 11:27 AM IST
NCRB: జైళ్లలో 4.83 లక్షల మంది .. 76 శాతం మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలే.. ఈ రాష్ట్రాల్లోనే అధికం..!

సారాంశం

NCRB:నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో "ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా 2020" నివేదికను విడుద‌ల చేసింది. దేశవ్యాప్తంగా 2020 చివరినాటికి 4.83 లక్షల మంది ఖైదీలు  జైళ్ల‌లో ఉండ‌గా, వారిలో 76 శాతం అండర్‌ ట్రయల్‌ ఖైదీలు కావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్రదేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలు ఉన్నారని NCRB నివేదిక పేర్కొంది. 

National Crime Records Bureau: 2020 ఏడాది చివ‌రి నాటికి దేశంలో 4.83 ల‌క్ష‌ల మంది ఖైదీలు జైళ్ల‌లో ఉన్నార‌ని నేష‌న్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  "ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా 2020" నివేదిక పేర్కొంది. జైళ్ల‌లో ఉన్న మొత్తం ఖైదీల‌లో అత్య‌ధికం అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలు ఉన్నార‌ని తెలిపింది. 76 శాతం మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలు ఉండ‌గా, 23 (1.11 లక్షల మంది) శాతం మందిపై మాత్రమే నేర నిరూపణ అయ్యిందని నివేదిక పేర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన‌ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌లోనే అత్యధికమంది అండర్‌ట్రయల్స్  ఖైదీలు ఉన్నారు. 

నేష‌న్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (National Crime Records Bureau) "ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా 2020" (Prison Statistics India 2020) తాజా నివేదిక వివ‌రాల ప్ర‌కారం.. 2020 ఏడాది చివ‌రి నాటికి దేశంలో 4.83 ల‌క్ష‌ల మంది ఖైదీలు జైళ్ల‌లో ఉన్నారు. జైళ్ల‌లో ఉన్న మొత్తం ఖైదీల‌లో అత్య‌ధికం అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలు ఉన్నార‌ని తెలిపింది. 76 శాతం మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలు ఉండ‌గా, 23 (1.11 లక్షల మంది) శాతం మందిపై మాత్రమే నేర నిరూపణ అయ్యిందని నివేదిక పేర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన‌ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌లోనే అత్యధికమంది అండర్‌ట్రయల్స్  ఖైదీలు ఉన్నారు. అలాగే,  దేశంలో వివిధ జైళ్లలో 4,926 మంది విదేశీయులు కూడా ఖైదీలుగా ఉన్నారని ఎన్సీఆర్‌బీ (NCRB) నివేదిక పేర్కొంది.  

దేశవ్యాప్తంగా మరో 3,549 మంది (లేదా ఒక శాతం కంటే తక్కువ) జైలు ఖైదీలు డీటెన్యూస్ అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వార్షిక నివేదిక పేర్కొంది. 2020 చివరి నాటికి దేశంలోని జైళ్లలో 4,926 మంది విదేశీ ఖైదీలు కూడా ఉన్నారని నివేదిక తెలిపింది. జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల్లో ఎక్కువ మంది 18-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. అలాగే, దోషుల్లో ఎక్కువ మంది 30-50 ఏళ్ల మధ్య వయస్కులేనని నివేదిక (NCRB) పేర్కొంది. మొత్తం ఖైదీల్లో 1.11 లక్షల మంది (23.04 శాతం) మందిపై మాత్రమే నేర నిరూపణ అయ్యిందని నివేదిక తెలిపింది. 3.68 లక్షల మంది (76.17 శాతం) అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. మ‌రో 3,549 (0.73 శాతం) మంది నిర్బంధంలో ఉన్నార‌ని పేర్కొంది.

4.83 లక్షల మంది ఖైదీల్లో 96 శాతం మంది పురుషులు ఉన్నారు. 3.98 శాతం మంది మహిళలు ఉన్నారు. అలాగే, జైళ్ల‌లో మ‌గ్గుతున్న వారిలో 0.01 శాతం మంది ట్రాన్స్‌జెండర్లు (70) కూడా ఉన్నార‌ని నేష‌న్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  (National Crime Records Bureau) "ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా 2020" (Prison Statistics India 2020) తాజా నివేదిక పేర్కొంది. 

ఖైదీల అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితా ప్ర‌కారం.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ఖైదీలు (1.06 లక్షలు) ఉండగా, బీహార్ (51,849), మధ్యప్రదేశ్ (45,456)ల‌లో  మొత్తం ఖైదీలలో వరుసగా 22.1 శాతం, 10.7 శాతం, 9.4 శాతం మంది ఉన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా శిక్ష పడిన ఖైదీలు (26,607) ఉండ‌గా, మధ్యప్రదేశ్ (13,641), బీహార్ (7,730) ల‌లో వరుసగా 23.9 శాతం, 12.2 శాతం, 6.9 శాతం మంది ఖైదీలుగా ఉన్నారు. ఎక్కువ మంది దోషులు 30-50 ఏళ్ల వయస్సు (49.9 శాతం) (55,653) వారు ఉండ‌గా,  ఆ తర్వాత 18-30 ఏళ్లు (28.7 శాతం, 31,935) మరియు 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ (21.4 శాతం, 23,856) వారు  ఉన్నారని నివేదిక పేర్కొంది.

అండర్ ట్రయల్స్‌లో ఉత్తరప్రదేశ్ (21.8 శాతం)లో అత్యధిక సంఖ్యలో ఖైదీలు (80,267) ఉండ‌గా,  బీహార్ (44,113), మధ్యప్రదేశ్ (31,695) ల‌లో వ‌రుస‌గా.. 12 శాతం, 8.6 శాతం మంది అండర్ ట్రయల్స్‌లో ఉన్నారని నేష‌న్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau) "ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఇండియా 2020" (Prison Statistics India 2020) తాజా నివేదిక పేర్కొంది. అండర్ ట్రయల్స్‌లో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వయస్సు గలవారు (48.8 శాతం, 1.79 లక్షలు) తర్వాత 30-50 ఏళ్లు (40.6 శాతం, 1.49 లక్షలు) మరియు 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ (10.6 శాతం, 39,136) ఉన్నారని NCRB డేటా పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్