
up election news 2022 : మొదటి సారిగా శాసన సభ ఎన్నికల బరిలో నిలవనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adhityanath) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గోరఖ్‌పూర్ (gorakhpur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న యోగి నామినేషన్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amith sha) యూపీకి రానున్నారు. సరిగ్గా ఉదయం 11.40 నిమిషాలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం కంటే ముందు 11 గంటల ప్రాంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గోరఖ్‌పూర్‌లోని మహారాణా ప్రతాప్ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని జనవరి 15వ తేదీన యూపీ బీజేపీ (bjp) ప్రకటించింది. ఈ మేరకు ఆ రోజు అభ్యర్థుల జాబితాలో యోగి పేరు కూడా ప్రకటించింది. ఈ నిర్ణయం తరువాత సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) కూడా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కర్హాల్ అసెంబ్లీ నియోజవకర్గం పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారు.
యూపీకి ముఖ్యమంత్రులుగా పని చేసిన అఖిలేష్ యాదవ్, యోగి ఆధిత్యనాథ్ లు ఇప్పటి వరకు శాసన సభకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. శాసన మండలికి ఎన్నికై రాష్ట్రాన్ని పాలించారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన ఎంపీ (mp) పదవికి రాజీనామా చేసి సీఎం పీఠాన్ని అధిష్టించారు. తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పని చేస్తున్నారు. వరుసగా యోగి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్న గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీకి పూర్తి పట్టు ఉంది. పైగా యోగి ఆధిత్యనాథ్ కు ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన అనుభవం కూడా ఉండటంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది.
అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో బీజేపీ అభ్యర్థిని తట్టుకొని ఆయన సునాయాసంగా గెలుపొందుతారని సమాజ్ వాదీ పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ (priyanka gandhi) కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వం నిర్ధారణ అయితే అక్కడ నుంచి సమజ్ వాదీ పార్టీ తమ అభ్యర్థిని కూడా ఉపసంహరించుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ (congress party) పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. కానీ వారికి పరాజయం ఎదురైంది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. సమాజ్ వాదీ పార్టీ మాత్రం ఆర్ఎల్ డీతో పొత్తు పెట్టుకొని పోటీలోకి దిగింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.