
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించబడింది. మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత రద్దు చేయబడింది లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహ్మద్ ఫైజల్‌కు క్రిమినల్ కేసులో శిక్ష విధించడంపై కేరళ హైకోర్టు స్టే విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై గతంలో జారిన చేసిన అనర్హత తదుపరి న్యాయపరమైన ప్రకటనలకు లోబడి నిలిపివేయబడింది పేర్కొంది. ఇక, మహ్మద్ ఫైజల్ లక్షద్వీప్ నుంచి 2019లో ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే కవరత్తిలోని సెషన్స్ కోర్టు.. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో దివంగత కేంద్ర మంత్రి పిఎం సయీద్ అల్లుడు మహ్మద్ సలీహ్‌పై హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్‌ను దోషిగా నిర్దారించింది.
సలీహ్‌ను హత్యచేయడానికి ప్రయత్నించినందుకు ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ డ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. దీంతో ఫైజల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. జనవరి 13న లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కవరత్తిలోని సెషన్స్ కోర్టు హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చిన నేపథ్యంలో జనవరి 11 నుంచి లోక్‌సభ సభ్యత్వానికి ఫైజల్ అనర్హుడని ప్రకటించింది.
అయితే దీనిని ఫైజల్.. కేరళ హైకోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలోనే జనవరి 25న కేరళ హైకోర్టు.. కవరత్తిలోని సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేసింది. అయితే ఆ తర్వాత కూడా ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించబడలేదు. దీంతో ఫైజల్.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫైజల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం గమనార్హం.