కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ర్యాలీలో ప్రజలపై నోట్లు విసిరిన కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్..

Published : Mar 29, 2023, 11:02 AM IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ర్యాలీలో ప్రజలపై నోట్లు విసిరిన కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్..

సారాంశం

కర్ణాటకలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ప్రజలపై కరెన్సీ నోట్లను విసిశారు. వీటిని తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారు. జేడీఎస్ కు కంచుకోటగా ఉన్న మాండ్యలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా బుధవారం మాండ్యలో ప్రచారం నిర్వహించింది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీ  బేవినహళ్లి సమీపంలోకి చేరుకుంది. దానిని చూసేందుకు వచ్చిన ప్రజలపై శివకుమార్ కరెన్సీ నోట్లు విసిరారు. 

తెలంగాణలో ప్రజలు బీజేపీని మాత్రమే నమ్ముతున్నారు.. ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న శివకుమార్ ఇతర కాంగ్రెస్ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బస్సులో నిల్చొని ఉన్న శివకుమార్ కరెన్సీ నోట్లను లాక్కుని ఊరేగింపులో పాల్గొన్న ప్రజలపై విసిరారు. దీంతో వాటిని ఏరుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు.

శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గం పాత మైసూరు లేదా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు తమ చేతులను బలోపేతం చేసుకోవాలని వొక్కలిగ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. మాండ్య జేడీఎస్ కంచుకోటగా ఉంది. జిల్లాలోని ఏడు స్థానాలను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాంతీయ పార్టీ గెలుచుకుంది. మే ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రులు కావాలనే ఆశయంతో ఉన్నారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి.

భార్య గొడవపడుతుంటే ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

కాగా.. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. ఇందులో 124 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఇప్పటికే ఖరారు చేసింది. దీనికి సంబంధించిన తొలి జాబితాను కూడా ఇటీవలే విడుదల చేసింది. అయితే బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి జాబితా రాలేదు.  జేడీఎస్ 93 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌