ముగిసిన 'మహా' పంపకం: మళ్ళీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ శరద్ పవారే...!

By telugu teamFirst Published Jan 5, 2020, 12:38 PM IST
Highlights

ఎట్టకేలకు నేటి ఆదివారం ఉదయం గవర్నర్ ఆ మంత్రివర్గాన్ని ఆమోదిస్తూ సంతకం చేయడంతో ఆయా శాఖలకు మంత్రులు వచ్చారు. ఈ ఉద్ధవ్ సర్కార్‌లో కీలక పదవులు సాధించుకోవడంలో మరోసారి హిట్ అయింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవారే! 

మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా చాలారోజులపాటు మంత్రివర్గం కొలువుదీరలేదు. కొన్నిరోజులకింద మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసినప్పటికీ కూడా వారికి మంత్రిత్వ శాఖలను మాత్రం కేటాయించలేదు. 

ఎట్టకేలకు నేటి ఆదివారం ఉదయం గవర్నర్ ఆ మంత్రివర్గాన్ని ఆమోదిస్తూ సంతకం చేయడంతో ఆయా శాఖలకు మంత్రులు వచ్చారు. ఈ ఉద్ధవ్ సర్కార్‌లో కీలక పదవులు సాధించుకోవడంలో మరోసారి హిట్ అయింది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవారే! 

Also read: నక్కతోక తొక్కడమంటే... అజిత్ పవార్ ను అడగాల్సిందే?

ఆయన చక్రం తిప్పి ఎన్‌సీపీని విజేతగా నిలిపారు. ఇప్పటికే పవార్ అన్న కొడుకు, ఎన్‌సీపీ కీలక నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా, ఆదివారం జరిగిన శాఖల కేటాయింపులో ఎన్‌సీపీ కేబినెట్ లో మరో రెండు కీలక పదవులను దక్కించుకుంది. 

అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖ దక్కగా, మరో ముఖ్యనేత అనిల్ దేశ్‌ముఖ్‌కు హోం శాఖ దక్కింది.  పట్టణాభివృద్ధి శాఖ కావాలని పట్టుబట్టిన శివసేన... తన పంతం నెగ్గించుకొని ఆ పదవిని సాధించింది. ఎకనాథ్ షిండేకు ఈ శాఖను అప్పగించింది శివసేన. 
 
ఎన్‌సీపీ ముఖ్య నాయకుడు, శరద్ పవార్ సన్నిహితుడు జయంత్ పాటిల్‌కు ఇరిగేషన్ శాఖ దక్కింది. శివసేన పార్టీ నుండి బయటకు వెళ్లి ఎన్సీపీలో చేరిన ఓబీసీ నేత ఛగన్ భుజ్‌ బల్‌ కు ఆహారం, పౌర సరఫరాల శాఖా దక్కింది. 

Also read: 'మహా' రాజకీయాలు: అందరి చూపూ పంకజ ముండేపైనే...

మరో కీలక నేత దిలీప్ వాల్సే పాటిల్‌కు ఎక్సైజ్ శాఖను కేటాయించగా, పంకజ ముండేను ఓడించి జెయింట్ కిల్లర్ గా అవతరించిన ధనంజయ్ ముండేకు సామాజిక న్యాయ శాఖను కేటాయించారు.  

ఇకపోతే ఈ 'మహా వికాస్ అఘాడి' సర్కార్ లో భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌కు రెవెన్యూ, ఇంధన శాఖలతో పాటు కీలకమైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్‌కు రెవెన్యూ శాఖ దక్కింది. అశోక్ చవాన్‌కు  పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖను కేటాయించారు. 

ఇకపోతే అందరూ ఊహించినట్టే ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ శాఖా దక్కింది. ఆరే చెట్ల నరికివేత అప్పుడు దానికి వ్యతిరేకంగా ఆదిత్య నిలిచినతీరు అతడికి యూత్ లో మంచి ఇమేజ్ ను తీసుకువచ్చింది.

దీనితో శివసేన పార్టీ అంటే ఏదైతే నెగటివ్ ఇమేజ్ ఉందొ దాన్ని చెరిపేయడానికి, పార్టీని మరింతగా విస్తరించడానికి ఆదిత్యను ముందుకు ప్రొజెక్ట్ చేయాలనీ భావిస్తుంది శివసేన. 

click me!