
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడడంతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో అతని వైద్యుడి సలహా మేరకు బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు ఆయన మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని, నవంబర్ 2న ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, నవంబర్ 3న జరిగే పార్టీ సమావేశానికి హాజరవుతారని శివాజీరావు గార్జే తెలిపారు.
ఆసుపత్రిలో రద్దీ ఉండకూడదని విజ్ఞప్తి
ఆసుపత్రిలో గుమికూడొద్దని ఎన్‌సిపి ఆఫీస్ బేరర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పవార్ కోలుకుంటున్నారని, నవంబరు 2న డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అంతేకాదు, నవంబరు 4, 5 తేదీల్లో షిరిడీలో నిర్వహించే పార్టీ శిబిరాల్లోనూ పాల్గొంటారని తెలిపింది.గతేడాది ఏప్రిల్‌లో పవార్‌కి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పిత్తాశయ శస్త్రచికిత్స జరిగింది. నోటిపూతలకు చికిత్స కూడా చేయించుకున్నాడు.