Navy officer: అనుమానాస్పద స్థితిలో నేవీ అధికారి మృతి.. విచార‌ణ‌కు ఆదేశించిన SNC

Published : Jun 21, 2022, 01:21 AM IST
Navy officer:  అనుమానాస్పద స్థితిలో నేవీ అధికారి మృతి.. విచార‌ణ‌కు ఆదేశించిన SNC

సారాంశం

Navy officer: ఒడిశాకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ సంతోష్ కుమార్ పాత్రో సోమవారం తెల్లవారుజామున నేవల్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు నేవీ ప్రకటన తెలిపింది.  ఈ ఘ‌ట‌న‌పై SNC విచారణకు ఆదేశించింది.  

Navy officer: ఒడిశాకు చెందిన ఓ నేవీ అధికారి సదరన్ నేవల్ కమాండ్‌లోని ఓ ఆసుపత్రిలో అనుమానాస్పద మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుడిని నేవీ అధికారి సంతోష్ కుమార్ పాత్రో గా గుర్తించారు. నౌకాదళ ఆసుపత్రిలో సంతోష్ కుమార్ పాత్రో  సోమవారం మరణించినట్లు సదరన్ నేవల్ కమాండ్ (ఎస్‌ఎన్‌సి) తెలిపింది.

ఒడిశాకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ సంతోష్ కుమార్ పటావో సోమవారం తెల్లవారుజామున నావల్ ఆసుపత్రిలో మరణించినట్లు నేవీ ప్రకటన తెలిపింది. పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, స్థానిక పోలీసులతో కేసు నమోదు చేసినట్లు నౌకాదళం తెలిపింది. దీనిపై సదరన్ నేవల్ కమాండ్ (SNC) కూడా విచారణకు ఆదేశించింది. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల నావికుడు కొచ్చిలోని నావల్ బేస్‌లో బుల్లెట్ గాయాలతో మరణించాడు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?