హైటెన్షన్‌ వైర్లలో చిక్కుకున్న పారాచూట్‌..నరకయాతనతో నేవీ కమాండో మృతి ..

Published : May 12, 2023, 11:02 PM IST
హైటెన్షన్‌ వైర్లలో చిక్కుకున్న పారాచూట్‌..నరకయాతనతో నేవీ కమాండో మృతి ..

సారాంశం

పారాజంపింగ్‌ సమయంలో పారాచూట్‌ హైటెన్షన్‌ వైర్‌లో ఇరుక్కుపోయి ఆర్మీ కమాండో మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.  

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పారాచూట్‌ ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కమాండో మరణించాడు. ల్యాండింగ్ సమయంలో కమాండో హై టెన్షన్ లైన్లలో ఇరుక్కుపోయాడు. దీంతో పారాచూట్‌కు మంటలు అంటుకుని వైర్లకు చిక్కుకుపోయింది. గాయపడిన కమాండోను గ్రామస్థులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మల్పురా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లో నియమించబడిన కమాండో అంకుర్ శర్మ ఆగ్రాలోని మల్పురా డ్రాపింగ్ జోన్‌లోని ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్‌లో పారాట్రూపింగ్ శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా.. అతను శుక్రవారం ఉదయం పారాచూట్‌ను ఉపయోగించి విమానం నుండి దూకాడు. కానీ, పారాచూట్ తెరుచుకునే చివరి సెకన్లలో అతను హై-వోల్టేజ్ పవర్‌లైన్‌లను గుర్తించడంలో విఫలమయ్యాడు. దీంతో అతని పారాచూట్ పవర్‌లైన్‌లో చిక్కుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం 10:30 గంటలకు జరిగింది. 

పొలాల్లో పని చేస్తున్న రైతులు పారాట్రూపర్ విద్యుత్‌లైన్‌లో చిక్కుకుపోవడాన్ని చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారని వర్గాలు పేర్కొన్నాయి. తనను తాను విడిపించుకునే ప్రయత్నంలో శర్మ చాలా ఎత్తు నుండి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, కమాండోను చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారని వర్గాలు పేర్కొన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంకుర్ శర్మ మృతి చెందాడు.

సమాచారం ప్రకారం.. ఆగ్రాలోని ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్ క్రమం తప్పకుండా సైనిక సిబ్బందికి పారాట్రూపర్ శిక్షణా కోర్సులను అందిస్తుంది. ఈ సంస్థ వేలాది కమాండోలకు పారాచూట్ జంప్‌లలో శిక్షణ ఇస్తుంది.  క్రికెటర్, టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ తన పారాట్రూపర్ శిక్షణను ఈ అకడామీలోనే పూర్తి చేశాడు . పారాట్రూపర్ కమాండోగా వర్గీకరించడానికి మల్పురా డ్రాపింగ్ జోన్‌లో ఐదు పారాచూట్ జంప్‌లు చేశాడు.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!