అంబానీ కోసమే ప్రధాని ఆ డీల్ చేశారు : జైపాల్ రెడ్డి

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 6:37 PM IST
Highlights

అంబానీకి లబ్ది చేకూర్చడానికే ప్రధాని మోదీ ప్రాన్స్ తో రాఫెల్ యుద్ద విమానాల ఢీల్ కుదుర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు.  అప్పటి రక్షణ మంత్రి పారికర్ కు తెలియకుండా ఈ  రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జైపాల్ తెలిపారు.రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్లలొ అవకతవకలు జరిగినట్లు స్వయంగా ప్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేనే ప్రకటించారని గుర్తు చేశారు. ఇలా ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయని జైపాల్ రెడ్డి వివరించారు.

రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలు ఒప్పందం మంత్రులకు కూడా తెలియకుండా ప్రధానే స్వయంగా కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీనివల్ల అంబానీకి నాలుగేళ్లలో లక్ష కోట్ల లబ్ధి చేకూరిందని అన్నారు. ఈ ఒప్పందం గురించి మంత్రులకు తెలియకున్నా అంబానికి తెలుసని ఎద్దేవా చేశారు. మోదీ ఒత్తిడితోనే ఈ ఢీల్ కు అంగీకరించామని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడి కామెంట్స్‌పై బీజేపీ సమాధానం చెప్పాలని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

ఈ రాఫెల్ ఢీల్ గురించి లోక్ సభలో అబద్దం చెప్పారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లపై కూడా జైపాల్ మండిపడ్డారు.  దేశ ప్రజలకు అబద్దం చెప్పిన వారు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోదీ పతనం ఈ స్కామ్ తోనే ప్రారంభమైందని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.   
 
click me!
Last Updated Sep 22, 2018, 6:38 PM IST
click me!