ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం నిర్ణయంపై సిద్దూ భార్య విమర్శలు

By narsimha lodeFirst Published Jun 20, 2021, 10:25 AM IST
Highlights

ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యేల నవజ్యోత్ కౌర్ సిద్దూ తీవ్రంగా విమర్శించారు.
 

చండీఘడ్: ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యేల నవజ్యోత్ కౌర్ సిద్దూ తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు ఎస్ఐ, నైబ్ తహసీల్దార్ ఉద్యోగాలను కట్టబెట్టాలని నిర్ణయం తీసుకొన్న మరునాడే ఆమె ఈ విమర్శలు చేశారు. 

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుమారులు ఫతేజంగ్‌సింగ్ బాజ్వా,  రాకేష్ పాండేల కొడుకులకు కారుణ్య పద్దతిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పంజాబ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.  అర్జున్ ప్రతాప్ సింగ్ బజ్వా ను ఎస్ఐ గా,  రెవిన్యూ శాఖలో తహసీల్దార్ గా నియమించారు. 

ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. మెరిట్ లేకుండా ఉన్నవారికి ఎలాంటి పదవి ఇవ్వరాదని చెప్పారు. అయితే ఇప్పటికే ఆర్ధికంగా ఉన్నవారికి కారుణ్య పద్దతిలో ఉద్యోగాలు కల్పించడం సరైంది కాదాని ఆమె అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ పర్సన్స్ లేదా స్వాతంత్ర్య సమరయోధులకు ఉద్యోగాలు ఇవ్వవచ్చని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సిద్దూ భార్య ఇవ్వాలని కోరారు. ఏ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించకుండా ఎస్ఐగా, తహసీల్దార్ గా ఉద్యోగాల్లో చేరుతారని తాను అనుకోనని ఆమె చెప్పారు.

పార్టీ అధిష్టానం వేచి చూడాలని కోరిందని ఆమె చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం వచ్చిన తర్వాత పంజాబ్  ప్రయోజనం కోసం  నిర్ణయం తీసుకొంటారని నవజ్యోత్ కౌర్ సిద్దూ తెలిపారు.కపిల్ శర్మ షోలో చేరడానికి సిద్దూ నిరాకరించాడు. క్రికెట్ టొర్నమెంట్ కోసం  రూ. 10 కోట్ల ఒప్పందాన్ని కూడ తిరస్కరించాడు. పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయాలని నిర్ణయిస్తే తాను అక్కడి నుండి పోటీ చేస్తానని ఆమె తెలిపారు. పాటియాలా అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.

click me!