
National Herand Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ మరోసారి విచారిస్తోంది. ఈడీ విచారణపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మరో 18 పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మల్లికార్జున్ ఖర్గే, రంజీత్ రంజన్, కెసి వేణుగోపాల్, మాణికం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె సురేష్‌లు ఉన్నారు.
నిర్బంధానికి ముందు రాహుల్ గాంధీ తన నానమ్మ ఇందిరా గాంధీ వైఖరిలో కనిపించారు. రోడ్డుపైనే ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీతో సహా పార్టీ ఎంపీలందరూ రాష్ట్రపతి భవన్ వైపు కవాతుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధర్నా చేయడానికి మమ్మల్ని అనుమతించడం లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎంపీలందరూ ఇక్కడికి వచ్చారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడారు. పోలీసులు మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వడం లేదు. పార్లమెంట్ లోపలకి అనుమతించడం లేదు. ఇక్కడ మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. ఇది వాస్తవికత. భారతదేశం ఒక పోలీసు రాజ్యం. ఇది నిజం.. మోడీ జీ ( రాజు)" అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
పోలీసుల సూచనల మేరకు మేము నిరసన తెలుపుతున్నాము. ఇదంతా ప్రతిపక్షాలను పూర్తిగా నాశనం చేయడానికి, ప్రతిపక్ష నేతల గొంతులను నొక్కడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కుట్ర. మేము భయపడం, మా పోరాటం కొనసాగుతుందని ఖర్గే అన్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ఆసక్తికరమైన పోస్టు కనిపించింది. ఈ పోస్టులో రెండు ఫోటోలను కాంగ్రెస్ షేర్ చేసింది. అందులో ఒక ఫోటోలో రాహుల్ గాంధీ, మరో ఫోటోలో రాహుల్ గాంధీ నాన్నమ్మ ఇందిరా ఉన్నారు. ఈ ఫోటో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్నట్టు కనిపిస్తుంది. అచ్చు తన నాన్నమ్మ తీరులో రాహుల్ గాంధీ నిరసన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇందిరా గాంధీ వలె రాహుల్ గాంధీ కూడా చాలా ధైర్యంగా ఉంటాడని తెలపడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.
అదే సమయంలో.. కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ఓ ట్వీట్ కనిపించింది. నాకు బాధ కలిగించింది, అవును, అవును దుర్యోధనా! నన్ను బంధించండి, నన్ను నేను బంధించడానికి వచ్చాను, “చరిత్ర పునరావృతం అవుతోంది…” అని కాంగ్రెస్ రాసుకొచ్చింది.