జాతీయ బాలికా దినోత్సవం 2024: జనవరి 24నే ఎందుకు నిర్వహిస్తారు?

By narsimha lode  |  First Published Jan 24, 2024, 11:09 AM IST


జాతీయ బాలికల దినోత్సవం ఎప్పటి నుండి  నిర్వహిస్తున్నారు.బాలికల దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయమై  ఓసారి తెలుసుకుందాం.


న్యూఢిల్లీ: భారతీయ సమాజంలో  ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా  జనవరి  24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారంలో  సమాన అవకాశాల కోసం మాత్రమే కాకుండా బాలిలక హక్కుల గురించి అవగాహనను పెంపొందించడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలపై  పరిష్కరించేందుకు గాను జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

జాతీయ బాలికా దినోత్సవం ద్వారా ప్రతి ఆడపిల్లకు సమానత్వం, గౌరవాన్ని కల్పించే విషయాన్ని  హైలైట్ చేయాలని  కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఏటా  జనవరి  24న  బాలికల సాధికారిత సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు దేశ వ్యాప్తంగా  అవగాహన ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Latest Videos

undefined

ప్రతి ఆడపిల్లకు సమాన అవకాశాలు, గౌరవం అందించడడానికి గల ప్రాముఖ్యతను జనవరి  24 తెలుపుతుంది. బాలికల విద్య, శ్రేయస్సుపై ఫోకస్ చేయనున్నారు.  బేటీ బచావో, బేటీ పడావో  కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.

జాతీయ బాలికా దినోత్సవాన్ని  2008 నుండి  మహిళా, శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.  2008 నుండి ప్రతి ఏటా భారత దేశం  అంతటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. లింగ అసమానత,  విద్యా పరిమితులు, పాఠశాల డ్రాపవుట్ లు, ఆరోగ్య సంరక్షణ, బాల్య వివాహాలు, లింగ ఆధారిత  హింసతో సతమతమౌతున్న బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించి  వాటికి పరిష్కారమార్గాలపై  కేంద్రీకరించనున్నారు.

 ఎంపవరింగ్  గర్ల్స్ ఫర్ ఎ బ్రైటర్ టుమారో అనేది  2019 థీమ్, 2020లో  థీమ్ మై వాయిస్, అవర్ కామన్ ఫ్యూచర్. డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ అనేది  2021 జాతీయ బాలికా దినోత్సవం థీమ్. 2024 ఏడాదికి ఇంకా థీమ్ ను ప్రకటించలేదు.2015  జనవరి  22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభించిన బేటీ బచావో, బేటీ పడావో  పథకం  వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని  జనవరి  24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.మహిళ, శిశు అభివృద్ది, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ,  విద్యా శాఖలు సంయుక్తంగా  ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడంపై  ఈ మూడు శాఖలు కేంద్రీకరించాయి. 

బాలికలపై వివక్ష చూపడంపై  ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.  బాలుడు, బాలికలు సమానమని  ప్రచారం చేయడంపై  కేంద్రీకరించింది.జాతీయ బాలికా దినోత్సవం బాలికల సామర్థ్యాన్ని  పెంపొందించడంపై ఫోకస్ పెట్టారు. బాలికలకు అవసరమైన జ్ఞానం, అవకాశాలను అందించడంపై ఫోకస్ పెట్టారు. బాల్య వివాహాలు, పోషకాహార లోపం, లింగ ఆధారిత హింస నుండి బాలికలను రక్షించడంపై  కేంద్రీకరించారు.

గత కొంత కాలంగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో బాలికల విద్య పెరిగింది. మరో వైపు బాల్య వివాహలు కూడ తగ్గిపోయాయి. తమ ఆశయాలను సాధించడానికి, స్వంత నిర్ణయాలు తీసుకోనే విషయంలో బాలికలు ముందుంటున్నారు.

click me!