యూఎస్‌లో రాహుల్ ఈవెంట్ వేదిక వద్ద జాతీయ గీతానికి అగౌరవం.. మైక్ చెక్‌ కోసం ఉపయోగించేశారు.. (వీడియో)

By Asianet NewsFirst Published Jun 1, 2023, 3:11 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి  తెలిసిందే. అయితే రాహుల్ అమెరికా పర్యటనలో భాగంగా పాల్గొన్న ఈవెంట్ వేదిక వద్ద భారత జాతీయ గీతానాకి అగౌరవపరిచే చర్య చోటు చేసుకుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి  తెలిసిందే. అయితే రాహుల్ అమెరికా పర్యటనలో భాగంగా పాల్గొన్న ఈవెంట్ వేదిక వద్ద భారత జాతీయ గీతానాకి అగౌరవపరిచే చర్య చోటు చేసుకుంది. సాధారణంగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో అంతరాయం కలిగించడం అగౌరవం కలిగించే విషయమనే సంగతి తెలిసిందే. అలాగే.. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు గౌరవంగా లేచి నిలబడి గర్వంగా పాడతారు. అయితే మే 30వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరైన కమ్యూనిటీ ఈవెంట్‌లో ఇది జరగలేదు. జాతీయ గీతాన్ని మైక్ చెక్ కోసం ప్లే చేశారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ నాయకులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో.. వేదిక వద్ద జాతీయ గీతాన్ని పిల్లల బృందం ఆలపిస్తున్న సమయంలో మధ్యలో మైక్ చెక్ పూర్తయిందని చెప్పడం కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న చాలా మంది ప్రేక్షకులు జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు వేదికపై కూర్చోవడం లేదా గుమికూడి ఉండడం కూడా చూడవచ్చు. 

 

I don’t know of any Indian in the Bay Area, who wouldn’t stand up for the National Anthem, unless Rahul Gandhi is addressing Pakistanis and Bangladeshis in America, and passing them off as Indians…

But then the Congress is capable of any chicanery. Empty hall is another story. pic.twitter.com/dzmGdDeDuh

— Amit Malviya (@amitmalviya)

అయితే ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ అమిత్ మాల్వియా.. ‘‘రాహుల్ గాంధీ అమెరికాలోని పాకిస్థానీలు, బంగ్లాదేశీయులను ఉద్దేశించి భారతీయులుగా మాట్లాడితే తప్ప... బే ఏరియాలో జాతీయ గీతానికి లేచి నిలబడని భారతీయులెవరూ నాకు తెలియదు. అటువంటి ఘటన చోటుచేసుకున్న కాంగ్రెస్‌కు ఎలాంటి చికాకు రాదు. హాల్‌ను ఖాళీ ఉండటం మరో కథ’’ అని పేర్కొన్నారు. 

ఈ ఘటన దిగ్భ్రాంతికరం అని మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ‘‘జాతీయ గీతం సమయంలో సగం మంది ప్రజలు లేచి నిలబడనందుకు బాధపడలేదు. తరువాత వారు జాతీయ గీతాన్ని మధ్యలో పాజ్ చేసి ఇది కేవలం మైక్ చెక్ మాత్రమే అని చెప్పారు. ఈ అగౌరవం ఎందుకు జరిగిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ ఆర్గనైజింగ్ టీమ్‌పై ఉంది? జాతీయ గీతాన్ని అగౌరవపరిచే ప్రేక్షకులు ఎవరు? రాహుల్ మైక్ చెక్ కోసం గీతాన్ని ఉపయోగించారా?’’ అని ప్రశ్నించారు. 

అయితే బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ మద్దతుదారులు వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ పిల్లలతో పాటు మరికొంత మంది వ్యక్తులతో కలిసి జాతీయ గీతం పాడుతున్న వీడియోలను వారు షేర్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో కూడా ప్రేక్షకులలో చాలా మంది వీడియోలను తీయడంలో బిజీగా ఉన్నప్పుడు.. కొంతమంది వ్యక్తులు తిరుగుతూ కనిపించారు.

 

Bakri is sharing a video of rehearsal done before the event saying nobody stood up for national anthem during Rahul’s event, during the everyone was on their feet and this video is of the rehearsal which was done before event.
It’s very clear that the men who took part in the… https://t.co/yzUNfOCRTi pic.twitter.com/QvVxtsKn1m

— Vijay Thottathil (@vijaythottathil)

ఇక, నిర్వాహకులు ‘‘మొహబ్బత్ కి దుకాన్’’ అని పిలిచిన ఈ కార్యక్రమంలో భారత్‌లో ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు, నాయకులను లక్ష్యంగా చేసుకుంటారని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 

click me!