ఢిల్లీ పేలుళ్లు: దర్యాప్తు ముమ్మరం.. దేశ రాజధానిలో ఇరానీయన్లపై ఫోకస్

By Siva KodatiFirst Published Jan 30, 2021, 7:29 PM IST
Highlights

దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటు చేసుకున్న పేలుళ్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం వుంటున్న ఇరాన్ దేశస్థుల్ని ప్రశ్నిస్తోంది ఢిల్లీ పోలీస్ స్పెషల్ టీమ్

దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటు చేసుకున్న పేలుళ్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం వుంటున్న ఇరాన్ దేశస్థుల్ని ప్రశ్నిస్తోంది ఢిల్లీ పోలీస్ స్పెషల్ టీమ్.

వీసాల గడువు ముగిసినప్పటికీ ఢిల్లీలోనే ఉంటున్న పలువురిని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ అధికారులతో కలిసి పరిశీలించింది ఇజ్రాయెల్ బృందం.

సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించారు. ఇక ఇప్పటికే ఘటనాస్థలంలో క్లూస్ సేకరించారు దర్యాప్తు అధికారులు. ఓ లెటర్‌తో పాటు సగం కాలిన దుప్పాట్టాను స్వాధీనం చేసుకున్నారు.

Also Read:ఢిల్లీలో పేలుడు మా పనే... జైషే ఉల్‌ హింద్‌ సంస్థ ప్రకటన..?

ఘటనాస్థలంలో లభించిన లేఖలో ఇది ట్రైలర్ మాత్రమేనని రాసినట్లుంది. ఇజ్రాయెల్ రాయబారిని హెచ్చరిస్తూ లేఖ రాశారు. ఇరానీ మిలటరీ ఆఫీసర్ ఖాసీం సులేమానీ పేరును అందులో ప్రస్తావించారు.

ఆయన హత్యకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పేలుళ్ల వెనుక ఇరాన్ హస్తం వుందని వార్తలు వస్తుండగా పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తమ పనేనని ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ ఎంబసీ ముందు ఐఈడీ పేలుడు తమ పనేనని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది జైషే ఉల్ హింద్.

click me!