అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవితో పాటు మరో రెండింటికి నరీందర్ బాత్రా రాజీనామా...

Published : Jul 19, 2022, 08:31 AM IST
అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవితో పాటు మరో రెండింటికి నరీందర్ బాత్రా రాజీనామా...

సారాంశం

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు నరీందర్ బిత్రా రాజీనామా చేశాడు. దీంతో పాటు తాను నిర్వహిస్తున్న మరో రెండు పదవుల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. 

న్యూఢిల్లీ : గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతోపాటు..  ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ Narinder Batra కథ  ముగిసింది. ఇటీవల తన మీద వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు  బత్రా ప్రకటించారు.

దీంతో పాటు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ( ioc) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారిగా ఎంపికైన బత్రా.. నిరుడు జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో కొనసాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపణలతో బత్రా మీద సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్ళ మీద సిబిఐ దాడులు చేసింది.  

మన కలలు చెదిరె.. కీలక పోరులో స్పెయిన్ చేతిలో ఓటమి.. హాకీ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత్..

ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవినుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించింది.  అయినా..  కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా  తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను  హాకీ ఇండియా  జీవితకాల సభ్యుడిగా నియమించుకుని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు.  దీంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు  ఐఓఏ అధ్యక్షుడు అయిన కారణంగానే లభించిన ioc సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu