జైలు నుంచి విడుదలైన రాజీవ్ హంతకులు.. 30 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచంలోకి

By Siva KodatiFirst Published Nov 12, 2022, 6:48 PM IST
Highlights

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. వీరందరిని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడుపుతున్న నళిని, శ్రీహారన్, శాంతన్ , మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్‌లు తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. 

కాగా... రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ, రవిచంద్రన్, సంతన్, మురుగన్, ఏజీ పెరరివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్‌లకు జీవిత ఖైదు విధించబడింది. అయితే ఈ ఏడాది మే18న రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాన్ని ప్రయోగిస్తూ.. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇక, రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు. 1998లో పేరారివాలన్‌కు Anti-Terrorism Court మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన బెల్ట్ బాంబును ప్రేరేపించడానికి ఉపయోగించిన 8-వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. 

Also Read:రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ఆరుగురు దోషులను విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం..

2001లో నళినీ శ్రీహరన్‌కు ఒక కుమార్తె ఉన్నందున ఆమె మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 2014లో పెరరివాన్, మరో ఇద్దరు మురుగన్, సంతన్  (ఇద్దరూ శ్రీలంక వాసులు) క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్నందున దోషుల మరణశిక్షను.. జీవిత ఖైదుగా మార్చారు. 

ఇక, తమిళనాడు ప్రభుత్వం 2018లో ఈ కేసులో పెరారివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వాటిని గవర్నర్.. రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేశారు. ఇక, పెరరివాలన్‌‌కు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మేలో పెరరివాలన్‌‌ను విడుదల చేయాలని ఆదేశించింది.  ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఇప్పటి వరకు నళిని, రవిచంద్రన్ ఇద్దరూ పెరోల్‌పై ఉన్నారు

click me!