వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.6.16 లక్షలు ఖాళీ!

By Rajesh Karampoori  |  First Published May 13, 2023, 3:59 AM IST

బ్యాంకర్లు తన కస్టమర్లను  ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కొంత మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల  బారినపడి మోసపోతున్నారు. తాజాగా. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ చెందిన ఓ యువకుడు వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేసి 6.16 లక్షలు పోగొట్టుకున్నాడు 


సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త దారిలో అమాయకులకు వల వేస్తున్నారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సైబర్ వలలో పడ్డారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 6.16 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ యువకుడు చేసిన తప్పల్లా కేటుగాళ్లు పంపిన మెసేజ్‌ను చదవడమే. అంతే ఆ యువకుడి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం మాయమైపోయాయి. దీలబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేయడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాలపై ఎన్నో వేదికలు, ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఖమ్లా అనే యువకుడు మోసపోయాడు. ఆ యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి.. లాటరీ తగిలింది.. మీ వ్యకిగత సమాచారాన్ని ధృవీకరించమని కోరుతూ ఓ లింక్‌ పంపింది. ఇలా తన వాట్సాప్ ఖాతాకు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన మరుక్షణంలో తన ఖాతా నుంచి రూ.6.16 లక్షలను సైబర్ నేరస్థులు ఊడ్చేశారు. లింక్ పై క్లిక్ చేసిన మరు క్షణంలో ఆమె బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి, ఖాతాలో ఉన్న బ్యాలన్స్ అంతటినీ ఒకే లావాదేవీగా ట్రాన్స్ ఫర్ చేసేశారు. దీలబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. లింక్ లను క్లిక్ చేసిన వెంటనే, బాధితుల ఫోన్ నంబర్ ఆధారంగా వారి బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వెబ్ లింక్ ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

Latest Videos

click me!