కీచక టీచర్.. ప్రాక్టికల్ పరీక్షల పేరిట.. 17మంది విద్యార్థులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం..

By SumaBala BukkaFirst Published Dec 7, 2021, 12:30 PM IST
Highlights

నవంబర్ 17వ తేదీ రాత్రి ముజఫర్ నగర్ లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE ప్రాక్టికల్స్ పరీక్షల సాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

ఉత్తర ప్రదేశ్ :  ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో  వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే.. 

నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా..  ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.

షాకింగ్ : నగలమ్మి, సుపారీ ఇచ్చి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హత్య చేయించిన భార్య..

ఈ బాలికలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. దీంతో ఉపాధ్యాయుడిని ఎదురించే ధైర్యం లేక మౌనంగా భరించారు. అయితే ఇందులో ఇద్దరు బాలికల తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్లకు జరిగిన అన్యాయ్యాని ఊరుకోదలుచుకోలేదు. వీరిద్దరూ పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్  ఉత్పాల్ ను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

ఎమ్మెల్యే చొరవతో బాధిత బాలికలు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అభిషేక్ యాదవ్ ను సంప్రదించారు.  ఎస్పీ యాదవ్  జరిపిన దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులైన ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసినా, వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించారు. 

సేవ పేరుతో చిన్నారులపై పైశాచికత్వం.. రౌడీషీటర్ కు దేహశుద్ధి....

ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో ఓ వ్యక్తి స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులో ఇచ్చే నెపంతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు అతనికి దేహశుద్ది చేసిన ఘటన సోమవారం జరిగింది. 

మల్కాపురం ప్రాంతానికి చెందిన దోమాన చిన్నారావు Rowdysheeter. మూడేళ్ల కిందట ‘Chinnarao Welfare Society’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పాడు. నాటి నుంచి పలువురికి సన్మానాలు చేయడం, పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం.. పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, తదితరాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చారు.  

ఇటీవల పలువురు ప్రముఖులకు సైతంAwardలు అందించారు. ప్రకాష్ నగర్ జివిఎంసి ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమాలు చేశారు. ఆయా కార్యక్రమాల వెనక ఆ రౌడీషీటర్ దుర్బుద్ధి ఉందనే విషయం సోమవారం నాటి ఘటనతో వెలుగులోకి వచ్చిందని victims Families మండిపడ్డారు.


 

click me!