ఆ చిత్రహింస భరించలేను.. అందుకే రాజీనామా..ఐఏఎస్ భావోద్వేగం..!

By AN TeluguFirst Published Jun 4, 2021, 3:45 PM IST
Highlights

‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’ అని మైసూరు కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి విధి నిర్వహణలో పదే పదే అడ్డొస్తున్నారని శిల్పానాగ్ ఆరోపించారు. 

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ రోహిణి సింధూరి తనను పని చేసుకోనివ్వడం లేదన్నారు. అడుగడుగున్నా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకార కలెక్టర్ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఒక ఐఎఎస్ అధికారికి, మరో ఐఏఎస్ అధికారికి మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. 

తాను కలెక్టర్ కు అన్ని విధాలా గౌరవం ఇచ్చానని, కానీ తనమీద ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదన్నారు. కాగా, శిల్పా నాగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్ గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. 
 
click me!