భూకంపం వచ్చిన శబ్దం.. తీరా చూస్తే ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ మెటల్ బాల్స్.. గుజరాత్ ప్రజల్లో ఆందోళన

Published : May 16, 2022, 03:28 PM IST
భూకంపం వచ్చిన శబ్దం.. తీరా చూస్తే ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ మెటల్ బాల్స్.. గుజరాత్ ప్రజల్లో ఆందోళన

సారాంశం

కొన్ని రోజులుగా గుజరాత్‌లో metal balls ఆకాశం నుంచి పడుతున్నాయి. ఆనంద్ జిల్లా, ఖేదా జిల్లా, సురేంద్రనగర్ జిల్లాలో ఈ లోహపు గోళాలు పడటం స్థానికులను ఆందోళనలకు గురిచేశాయి. ఈ గోళాలు పడ్డ ఘటనలో ఎవరూ గాయపడలేదు. భూమికి సమీపంలోని కక్షలో శాటిలైట్ శకలాలే బహుశా ఇవి కింద పడి ఉండొచ్చని అనుమానాలు వస్తున్నాయి.  

అహ్మదాబాద్: గుజరాత్‌లో గందరగోళం నెలకొంది. పలు జిల్లాల్లో అంతుచిక్కని విధంగా మిస్టరీయస్ మెటల్ బాల్స్ పడుతున్నాయి. ఆకాశం నుంచి నలుపు, సిల్వర్ కలర్ లోహపు గోళాలు పడ్డాయి. వరుసగా పలు గ్రామాల్లో ఈ గోళాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తొలుత భారీ శబ్దం రాగానే ప్రజలు భూకంపం అని భయపడ్డారు. కొద్దిసేపటికి అటువైపుగా వెళ్లి చూస్తే అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు కనిపించాయి. అవి ఆకాశం నుంచి ఊడిపడ్డాయి. కానీ, అవి ఏమిటా? ఎక్కడి నుంచి పడుతున్నాయి? అనే విషయం అంతుచిక్కడం లేదు. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది.

తొలుత ఈ లోహపు గోళాలు ఆనంద్ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. భలేజ్, ఖంబోలాజ్, రాంపుర గ్రామాల్లో మే 12వ తేదీన రిపోర్ట్ అయ్యాయి. ఈ మెటల్ బాల్స్ సుమారు 5 కిలోల బరువు ఉంటాయని భావిస్తున్నారు. నీటి బిందెల కంటే కొంత చిన్న సైజులో ఉన్నాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అయితే, ఈ లోహపు గోళాలు కింద పడిన ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేవు. ఆ రోజు సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఈ మెటల్ బాల్స్ పడినట్టు తెలిసింది. అంతేకాదు, ఈ మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే ఆనంద్ జిల్లాతోపాటు ఖేదా జిల్లాలోని ఉమ్రేథ్, నదియాడ్ గ్రామాల్లో ఈ మెటల్ బాల్స్ వెలుగులోకి వచ్చాయి.

తాజాగా సురేంద్ర నగర్ జిల్లాలోనూ సాయిలా గ్రామంలో ఈ లోహపు గోళాలు కనిపించాయి. చాలా వరకు ఈ లోహపు గోళాలు ఓపెన్ ఏరియాలోనే పడ్డాయి.

అధికారులకూ ఈ గోళాల విషయంపై ఏమీ తోచడం లేదు. లోహలపు గోళాలు పడ్డట్టు సమాచారం అందగానే పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. వాటిని పరిశీలించారు. అవి ఆకాశం నుంచే పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. కానీ, కేసు నమోదు చేయలేదు. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి ఫిజరల్ రీసెర్చ్ ల్యాబరేటరీ నిపుణులను రంగంలోకి దించారు. 

ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ నిపుణులు అంతరిక్షంపై ఫోకస్ పెడుతుంది. స్పేస్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తు ఉంటుంది. ఈ నిపుణులు లోహపు గోళాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇవి భూమికి సమీప కక్షలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలు అయి ఉంటాయనే ప్రాథమిక అవగాహనకు అధికారులు వచ్చారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్