బెండకాయ నూడిల్స్ ఎప్పుడైనా రుచి చూశారా?

Published : Apr 06, 2023, 11:06 AM IST
 బెండకాయ నూడిల్స్ ఎప్పుడైనా రుచి చూశారా?

సారాంశం

 ఈ నూడిల్స్ మయన్మార్ లో తయారు చేశారు. ఓ వ్యక్తి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను మాయన్మార్ లో బెండకాయ నూడిల్స్ ట్రై చేశాను అంటూ షేర్ చేయగా.. ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.

నూడిల్స్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా లాగించేస్తారు. ఈ నూడిల్స్ తయారు చేసేటప్పుడు.. దానిలో చాలా రకాల కూరగాయలు కూడా వేస్తారు. ముఖ్యంగా క్యాబేజీ, క్యారేట్ , బీన్స్ లాంటివి వేస్తారు. నూడిల్స్ హెల్దీగా ఉండాలని వీటిని జత చేస్తారు. అయితే... ఎప్పుడైనా నూడిల్స్ బెండకాయ ముక్కలు వేసుకొని తిన్నారా..? వినడానికి వింతగా ఉన్న ఈ రకం నూడిల్స్ ని కూడా తయారు చేస్తున్నారు.

ఓ రెస్టారెంట్ లో బెండకాయ ముక్కలతో నూడిల్స్ తయారు చేశారు. నిజానికి చాలా మంది పిల్లలు అసలు బెండకాయ తినడానికే పెద్దగా ఇష్టపడరు. అలాంటిది ఏకంగా నూడిల్స్ లో బెండకాయ వేస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. దీనిని నెట్టింట షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఈ నూడిల్స్ మయన్మార్ లో తయారు చేశారు. ఓ వ్యక్తి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను మాయన్మార్ లో బెండకాయ నూడిల్స్ ట్రై చేశాను అంటూ షేర్ చేయగా.. ఆ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఈ కాంబినేషన్ ని కొందరు వావ్ అంటూ పొగిడేస్తుంటే.. కొందరు మాత్రం.. ఛీ ఇదేం కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 


ఈ పోస్టుకి 2.4 వేల వ్యూస్ రావడం విశేషం. ఈ భయంకరమైన కాంబినేషన్ నూడిల్స్ ని రుచి చేయాలనే ఆలోచన కూడా తమకు లేదు అంటూ... కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్