Mizoram: ట్ర‌క్కు నిండా బాంబులు.. ఈశాన్య భార‌తంలో క‌ల‌క‌లం !

Published : Jan 22, 2022, 05:46 AM IST
Mizoram: ట్ర‌క్కు నిండా బాంబులు.. ఈశాన్య భార‌తంలో క‌ల‌క‌లం !

సారాంశం

Mizoram: ఈశాన్య భార‌త రాష్ట్రమైన మిజోరం (Mizoram)లో  మందుగుండు సామ‌గ్రి తీవ్ర కలకలం రేగింది. ఏకంగా  ట్రక్కు నిండా బాంబులు (Explosives recovered in Mizoram)  పట్టుబ‌డ‌టం..  ఒక వాహ‌నంలో 2500 కేజీల పేలుడు ప‌ద‌ర్థాల‌ను త‌ర‌లించ‌డం అధికారుల‌ను షాక్ కు గురిచేస్తున్న‌ది. మయన్మార్ (Myanmar) సరిహద్దులో ఉన్న జవ్‌గ్లింగ్ జిల్లా సైహా గ్రామంలో ఓ ట్ర‌క్కు నిండా పేలుడు ప‌ద‌ర్థాలు త‌ర‌లిస్తుండ‌గా, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయి.   

Mizoram: ఈశాన్య భార‌త రాష్ట్రమైన మిజోరం (Mizoram)లో  మందుగుండు సామ‌గ్రి తీవ్ర కలకలం రేగింది.  ఏకంగా  ట్రక్కు నిండా బాంబులు (Explosives recovered in Mizoram)  పట్టుబ‌డ‌టం.. ఒక వాహ‌నంలో 2500 కేజీల పేలుడు ప‌ద‌ర్థాల‌ను (2500 kg of explosives) త‌ర‌లించ‌డం అధికారుల‌ను షాక్ కు గురిచేస్తున్న‌ది. మయన్మార్ (Myanmar) సరిహద్దులో ఉన్న జవ్‌గ్లింగ్ జిల్లా సైహా గ్రామంలో ఓ ట్ర‌క్కు నిండా పేలుడు ప‌ద‌ర్థాలు త‌ర‌లిస్తుండ‌గా, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో ఒక మ‌య‌న్మార్ జాతీయుడితో పాటు మ‌రో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మయన్మార్ (Myanmar) సరిహద్దులో ఉన్న జవ్‌గ్లింగ్ జిల్లా సైహా గ్రామంలో ఓ ట్ర‌క్కు నిండా పేలుడు ప‌ద‌ర్థాలు త‌ర‌లిస్తుండ‌గా, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు (Assam Rifles) ప‌ట్టుకున్నాయి. అయితే, దీనికి ముందు భారీ మొత్తంలో పేలుడు ప‌ద‌ర్థాల ర‌వాణా జ‌రుగుతున్న‌ద‌ని అధికారుల‌కు స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలోనే నిఘా పెట్టిన యంత్రాంగం.. దుండ‌గుల‌ను, పేలుడు ప‌ద‌ర్థాల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ అమ‌లు చేసింది. మిజోరం స్థానిక పోలీసుల‌తో క‌లిసి.. అసోం ఆర్మీ రైఫిల్స్ (Assam Rifles) కొన‌సాగించిన ఈ ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ లో భాగంగా జాయింట్ సెర్చ్ ఆపరేషన్  కొన‌సాగించారు. ఈ క్ర‌మంలోనే తుయ్‌పాంగ్-జవ్‌గ్లింగ్ రోడ్డుపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.  అనుమానాస్పదంగా క‌నిపించిన ఓ ట్రక్కు ఆపి త‌నిఖీ చేయ‌గా, భారీగా పేలుడు ప‌ద‌ర్థాలు వెలుగుచూశాయి. ఓ ట్ర‌క్కు నిండా పేలుడు ప‌ద‌ర్థాల‌ను  (Explosives recovered in Mizoram) ర‌వాణా చేయ‌డం అధికారుల‌ను షాక్ గురిచేసింది.

ట్ర‌క్కుతో పాటు అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 2,500 కిలోగ్రాముల పేలుడు పదార్థాలు (2500 kg of explosives), 4,500 మీటర్ల డిటోనేటర్లు, భారత కరెన్సీ మొత్తం రూ.73,500, మయన్మార్ (Myanmar) కరెన్సీ క్యాట్ 9,35,000 ఉన్నాయి. పేలుడు ప‌ద‌ర్థాల‌ను మోసుకెళ్తున్న ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ MZ 07 7936తో మిజోరంలో రిజిస్ట‌ర్ అయిన‌ట్టు ఉంద‌ని అస్సాం రైఫిల్స్ అధికారి తెలిపారు. వాహ‌నంలో భార‌గీ పేలుడు ప‌ద‌ర్థాల‌ను ర‌వాణా చేస్తున్న మయన్మార్ జాతీయుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని మిగ‌తా విష‌యాల‌పై ద‌ర్వాప్తు చేస్తున్నారు. 

Assam Rifles మేజర్ రావత్  మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో పేలుడు పదార్థాలు (2500 kg of explosives), డిటోనేటర్ల (detonators) ను రవాణా చేసిన ఇద్దరు భారతీయ పౌరులు, చిన్ నేషనల్ ఫ్రంట్ (CNF)కి చెందిన ఒక మయన్మార్ పౌరుడు పట్టుబడ్డారని తెలిపారు. CNF అనేది మయన్మార్  (Myanmar) లో స్వయం నిర్ణయాధికారం, జాతి సమానత్వం, ప్రజాస్వామ్యం ఆధారంగా ఫెడరల్ యూనియన్ కోసం పోరాడుతున్న చిన్ జాతీయవాద రాజకీయ సంస్థ. దాని సాయుధ విభాగం చిన్ నేషనల్ ఆర్మీ (CNA) అని రావత్ చెప్పారు.  భారీ మొత్తంలో పేలుడు ప‌ద‌ర్థాలు స్వాధీనం చేసుకోవడం ద్వారా పౌరుల విలువైన ప్రాణనష్టాన్ని అస్సాం రైఫిల్స్ నిరోధించాయని మేజర్ రావత్ అన్నారు. కేసు దర్యాప్తులో మరింత ముందుకు సాగడానికి అరెస్టు చేసిన వారి గుర్తింపును వెల్ల‌డించ‌లేదు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?