సోదురుడి వరుసయ్యే వ్యక్తితో భార్య అక్రమసంబంధం.. ఎంత చెప్పినా వినలేదని.. ఆ భర్త చేసిన దారుణం...

Published : Aug 26, 2021, 02:31 PM IST
సోదురుడి వరుసయ్యే వ్యక్తితో భార్య అక్రమసంబంధం.. ఎంత చెప్పినా వినలేదని.. ఆ భర్త చేసిన దారుణం...

సారాంశం

పాట్నాకు చెందిన  అవినాష్ అనే వ్యక్తికి కొంత కాలం క్రితం  పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికి అవినాష్ భార్య...అవినాష్ చౌదరి భర్త సంజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం తెలిసి అవినాష్ షాక్ అయ్యాడు.  తన భార్యకు పలుమార్లు  నచ్చజెప్పడానికి కి ప్రయత్నించాడు.

ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య ఇంట్లోనే సోదరుడి వరసయ్యే.. తన బావ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం అతన్ని కలవరానికి గురి చేసింది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి తో ఇలా తన భార్య వివాహేతర సంబంధం  పెట్టుకున్నట్లు తెలిసి ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆమె చేస్తున్నది తప్పని ఆమెకు వివరించాడు.

తనకు విషయం తెలిసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.  అయినా ఆమె వినలేదు.  దీంతో విసుగొచ్చి నా అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు.  తన మరణానికి భార్య, బావలే కారకులుగా పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు.  ఈ ఘటన బీహార్లోని పాట్నాలో వెలుగుచూసింది. పాట్నాకు చెందిన  అవినాష్ అనే వ్యక్తికి కొంత కాలం క్రితం  పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికి అవినాష్ భార్య...అవినాష్ చౌదరి భర్త సంజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం తెలిసి అవినాష్ షాక్ అయ్యాడు.  తన భార్యకు పలుమార్లు  నచ్చజెప్పడానికి కి ప్రయత్నించాడు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉండేది అని అవినాష్  చెల్లెలు చెప్పింది.  తాజాగా తన సోదరిని, బావను ఇంటికి పిలిచిన అవినాష్ వారిద్దరితో చాలా సీరియస్ గా మాట్లాడినట్లు కూడా ఆమె తెలిపింది. తన భార్యతో సంబంధం తెలుసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భావనను బెదిరించాడు.

అయినా సరే భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. వరుసకు సోదరుడు అయ్యే తన భర్త బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన అవినాష్ ఉరేసుకుని మరణించాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని గదిలో నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు..  అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?