మొక్కలు కత్తిరించే కత్తితో.. నలుగుర్ని కసాబిసా నరికేసి...ఆర్మీ మాజీ అధికారి సరెండర్...కారణమేంటంటే..

By AN TeluguFirst Published Aug 26, 2021, 1:54 PM IST
Highlights

నిందితుడు రావు రాయి సింగ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. మృతులు సునీత యాదవ్, క్రిష్ణన్ తివారి, క్రిష్ణన్ భార్య అనామిక తివారి అని వెల్లడించారు. వీరిని హతమార్చడానికి నిందితుడు మొక్కలను కత్తిరించే కత్తిని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. 
 

హర్యానా : ఓ ఆర్మీ మాజీ అధికారి తన కోడలితో పాటు అద్దెకుంటున్న కుటుంబంలో ముగ్గురిని గంటన్నరలో హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో మంగళవారం ఉదయం జరిగిందీ దారుణం. తన కోడలితో పాటు అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి, అతడి భార్య, తొమ్మిదేళ్ల కూతురిని పదునైన ఆయుధంతో చంపాడు. 

అయితే దాడి చేసే సమయంలో మృతుడి చిన్న కూతురు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మీద కూడా నిందితుడు దాడికి దిగాడు. కాకపోతే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో క్రిష్ట పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది.

నిందితుడు రావు రాయి సింగ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. మృతులు సునీత యాదవ్, క్రిష్ణన్ తివారి, క్రిష్ణన్ భార్య అనామిక తివారి అని వెల్లడించారు. వీరిని హతమార్చడానికి నిందితుడు మొక్కలను కత్తిరించే కత్తిని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. 

దీనికి ముందు నిందితుడు ఇంటి తలుపులు గడియ పెట్టాడు. ఆ తరువాత తన కోడలిని చంపేసి, అక్కడినుంచి తమ ఇంట్లో అద్దెకుంటున్న క్రిష్ణన్‌ గదిలోకి వెళ్లి అతడిని చంపాడు. ఆ తరువాత అతడి భార్య, కూతురిని చంపేశాడు. క్రిష్ణన్ తన కోడలితో శారీరక సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఈ హత్యలు చేసినట్లు పోలీస్ స్టేషన్ ముందు నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.
 

click me!