Final Match: నా పేరు జాన్సన్.. క్రీజులోకి దూసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు?.. పాలస్తీనాతో ఏం సంబంధం?

By Mahesh K  |  First Published Nov 19, 2023, 7:31 PM IST

నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని దూసుకుని వచ్చిన ఘటన సంచలనమైంది. ఆయన పేరు జాన్సన్ అని ఆ వ్యక్తి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లుతుండగా మీడియాకు వెళ్లడించాడు.
 


న్యూఢిల్లీ: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. భారత బ్యాట్స్‌మెన్‌లు క్రీజులోకి దిగారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని క్రీజులోకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తి పాలస్తీనా ఫ్లాగ్ ఉన్న షర్ట్ ధరించి ఉన్నాడు. ఆ దేశానికి మద్దతు ఇస్తున్న వ్యక్తి అనూహ్యంగా క్రీజులోకి దూసుకువచ్చాడు. ఇంతకీ ఆయన ఎవరు?

భద్రతను దాటుకుని దూసుకెళ్లిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. చంద‌ఖేడా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నా పేరు జాన్సన్, అలియాస్ కింగ్ కోహ్లీ పైజామా బ్యాన్ అని ఆ వ్యక్తి వివరించాడు. ఆయనను తీసుకెళ్లుతుండగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. పేరు ఏమిటని అడగ్గా.. తన పేరు జాన్సన్ అని, నిక్ నేమ్ జాన్ అని వివరించాడు. తాను విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడానికే గ్రౌండ్‌లోకి వెళ్లినట్టు చెప్పాడు.

Latest Videos

Also Read: Team India: తొలిసారి బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్.. ఇంతకీ అవి ఏమన్నాయో తెలుసా?

ఆయన జాన్సన్ అని, ఆస్ట్రేలియా పౌరుడు అని పోలీసులు తెలిపారు. ఆయన పాలస్తీనా మద్దతుదారుడని, విరాట్ కోహ్లీని కలువాలని భావించినట్టు వివరించారు. ఆయన టీ షర్ట్ పై పాలస్తీనాపై బాంబులు వేయడం ఆపండి అనే లైన్ రాసి ఉన్నది. పాలస్తీనా జెండాను మాస్క్‌గా పెట్టుకున్నాడు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ జెండాను పట్టుకున్నాడు. 

స్టేడియంలోకి రావడానికి ముందు ఆ వ్యక్తి ఇండియన్ జెర్సీని ధరించినట్టు చెబుతున్నారు. జాన్సన్ తన గుర్తింపును వెల్లడిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

click me!