రష్యాతో యుద్ధం విషయమై చాన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ వార్తల్లో ఉంటున్నది. ఈ దేశానికి భర్త వెళ్లాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త తిరిగి రాగానే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ముంబయి: మహారాష్ట్రలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తన భర్త ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడని తెలిసిన తర్వాత ఆమె ఉరిపోసుకుని చనిపోయింది. భర్త ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణల కింద ఆయనను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఉక్రెయిన్ గొడవ ఏమిటీ?
మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి చెందిన 26 ఏళ్ల నితీశ్ నాయర్ వర్క్ అవసరాల కోసం తరుచూ ఉక్రెయిన్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే నితీశ్ నాయర్‌కు ఉక్రెయిన్‌లో ఓ మహిళతో పరిచయం అయిందని, ఆ మహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్నట్టూ భార్యకు తెలిసింది. ఈ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. నితీశ్ నాయర్‌ను మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లవద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. భార్య వద్దని చెబుతున్నప్పటికీ నితీశ్ నాయర్ ఉక్రెయిన్‌కు వెళ్లుతుండేవాడు.
నితీశ్ నాయర్ నవంబర్ 8వ తేదీన ముంబయిలోని ఆఫీసుకు వెళ్లుతున్నట్టు భార్య కాజల్‌కు చెప్పాడు. కానీ, ఆయన ఉక్రెయిన్ ఫ్లైట్ ఎక్కాడు. ఉక్రెయిన్‌లో దిగిన తర్వాత భార్యకు ఓ మెస్సేజీ పంపాడు. తాను ఉక్రెయిన్‌కు చేరుకున్నాడని, మరెప్పుడూ మహారాష్ట్రకు తిరిగి రానని చెప్పాడు. దీంతో కాజల్ తీవ్రంగా మనోవేదనకు గురైంది. కొంత మంది ఫ్రెండ్స్‌కు మెస్సేజీలు పెట్టి ఆత్మహత్య చేసుకుంది.
Also Read: Team India: తొలిసారి బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్.. ఇంతకీ అవి ఏమన్నాయో తెలుసా?
కాజల్ తండ్రి సురేంద్ర సావంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నితీశ్ అక్రమ సంబంధాన్ని తన బిడ్డ తీవ్రంగా వ్యతిరేకించిందని, కానీ, ఆయన భార్య అభ్యంతరాలను పట్టించుకోకుండా ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. నితీశ్ నాయర్ మళ్లీ మహారాష్ట్రలో దిగగానే పోలీసులు అరెస్టు చేశారు.