ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హిందూ బాలుడికి ముస్లిం యువకుడి రక్తదానం.. మధ్యప్రదేశ్‌లో మతసామరస్యం

By Mahesh KFirst Published Jan 1, 2023, 7:14 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో అనేమియాతో బాధపడుతున్న రెండు నెలల బాలుడికి ఓ ముస్లిం యువకుడు రక్తం దానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. బాలుడి తండ్రి రక్తం కోసం ఫోన్ చేయగానే.. నమాజ్ కోసం బయల్దేరిన ఆ యువకుడు నేరుగా హాస్పిటల్ చేరుకున్నాడు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. హిందూ బాలుడు రక్తం లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో విషయం తెలుసుకుని ఓ ముస్లిం యువకుడు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేశాడు. దీంతో ఆ బాలుడు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

36 ఏళ్ల రాఫత్ ఖాన్ శనివారం ఇంటి నుంచి నమాజ్ చేయడానికి బయల్దేరాడు. కానీ, ఇంతలోనే తన ఫోన్ రింగ్ మోగింది. లిఫ్ట్ చేస్తే.. 60 రోజుల బేబీ బాయ్ అనేమియాతో బాధపడుతున్నాడని, ఆ బాలుడికి వెంటనే రక్తం అవసరం ఉన్నదని తెలిసింది. అంతే.. మరో ఆలోచన చేయకుండా బైక్ పై నేరుగా హాస్పిటల్‌లో వాలిపోయాడు.

ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా బైక్ తీసి బ్లడ్ డొనేట్ చేయడానికి జిల్లా హాస్పిటల్‌కు వెళ్లానని రాఫత్ ఖాన్ ఆదివారం పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపాడు. మనోరియా గ్రామానికి చెందిన ఆ బేబీ తండ్రి రక్తం కోసం బయట దళారిని నమ్మి మోసపోయాడని, చివరకు తనకు ఫోన్ చేశాడని వివరించాడు. రక్తం కోసం ఆ దళారి రూ. 750 తీసుకున్నాడని, ఆ తర్వాత జారుకున్నాడని చెప్పాడ.

Also Read: దేశమంతా ద్వేషం లేదు.. అది టీవీ చానెళ్లలోనే ఉన్నది.. పాదయాత్రతో స్పష్టమైంది: ఎర్రకోటపై రాహుల్ గాంధీ

ఖాన్ రక్తం దానం చేసిన తర్వాత ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యం మెరుగైందని తండ్రి జితేంద్ర తెలిపాడు. తన కొడుకుకు రక్తం కావాల్సిన ఆపద కాలంలో ఖాన్ ఒక దేవుడి లెక్క నవ్వు కుంటూ వచ్చాడని వివరించడు. 

రక్తం ఎక్కించిన తర్వాత బేబీ కండీషన్ ఇప్పుడు స్టేబుల్‌గా ఉన్నదని పెడిట్రీషియన్ డాక్టర్ ముకేష్ ప్రజాపతి తెలిపారు . 

రాఫత్ ఖాన్ రక్తం దానం చేయడం ఇదే తొలిసారి కాదు. ఏడాది కాలంలో ఆయన కనీసం 13 సార్లు రక్తం దానం చేశాడు. రక్తం దానం చేయడం ద్వారా ఇతరుల కళ్లలో ఆనందం చూసి సంతృప్తి పొందుతానని, సంతోషపడతానని ఖాన్ తెలిపాడు.

click me!