
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల ముస్లిం ఆధ్యాత్మిక గురువును మంగళవారం దారుణంగా కాల్చి చంపారు.
స్థానికంగా "సూఫీ బాబా"గా ప్రసిద్ధి చెందిన ఖ్వాజా సయ్యద్ చిస్తీ ముంబైకి 200 కి.మీ దూరంలో హత్యకు గురయ్యాడు. తలపై కాల్పులు జరపడంతో అతను వెంటనే మరణించాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన తరువాత హంతకులు అతని SUVలలో ఒకదానిలో తప్పించుకున్నారు. ఈ హత్యలో సూఫీ బాబా డ్రైవర్ ప్రధాన నిందితుడు.
సయ్యద్ చిస్తీ నాసిక్‌లోని యోలా పట్టణంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడని, హత్యలో మతపరమైన ఉద్దేశాలు లేవని పోలీసులు తెలిపారు. సయ్యద్ చిస్తీ డ్రైవర్ పేరును సాక్షులు పేర్కొన్నారని పోలీసు అధికారి సచిన్ పాటిల్ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. సయ్యద్ చిస్తీ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు. దీనివల్ల మన దేశంలో భూమిని కొనుగోలు చేయలేడు. దీంతో స్థానిక ప్రజల సహాయంతో భూమిని కొనుగోలు చేశాడు. హత్యకు ఈ భూమే కారణం అయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
అఫ్ఘనిస్థాన్ కు చెందిన 35 యేళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాసిక్ లో ఉంటున్నారు. యోలా పట్టణంలోని MIDC ఓపెన్ ప్లాట్ లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. నుదుటిమీద పిస్టోల్ తో కాల్పులు జరపడంతో బాబా అక్కడిక్కడే మృతి చెందారు.
Nupur Sharma News: నూపుర్ శర్మను ఎప్పుడు అరెస్టు చేస్తారు? 'సుప్రీం' స్పష్టత
ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రం హుబ్లీ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరళ వాస్తు నిపుణులు చంద్రశేఖర్ గురూజీ హత్యకు గురయ్యారు. వాస్తు సూచనల కోసం వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచి పరారయ్యారు. చంద్రశేఖర్ శరీరంపై 39 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిని హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని బెదిరిస్తూ అత్యంత పాశవికంగా దాడి చేశారు దుండగులు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హత్య జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
కర్ణాటకలోని హుబ్లీ నగర శివార్లలోని ఉణకల్ హోటల్లో చంద్రశేఖర్ బస చేశారు ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆయన నుంచి వాస్తు సలహాలు తీసుకోవాలని చెబుతూ కలిసేందుకు వచ్చారు. ఆయనతో భేటీ అయిన కొద్ది క్షణాల్లోనే కత్తులతో దాడి చేశారు. ముప్పై తొమ్మిది సార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని హుబ్లీ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన స్థలాన్ని పోలీస్ కమిషనర్ లాబూరామ్ సందర్శించారు. హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బినామీ ఆస్తుల వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.