అయోధ్యలో భూమి పూజ: 800 కి.మీ పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం

By narsimha lodeFirst Published Jul 27, 2020, 7:18 PM IST
Highlights

అయోధ్యలో రామమందిర నిర్మాణం  కోసం ఆగష్టులో జరిగే భూమి పూజకు హజరయ్యేందుకు ఓ ముస్లిం పాదయాత్రను చేపట్టాడు. తన స్వగ్రామం నుండి 800 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యను చేరుకోవడానికి ఆయన పాదయాత్ర ప్రారంభించాడు. 

లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణం  కోసం ఆగష్టులో జరిగే భూమి పూజకు హజరయ్యేందుకు ఓ ముస్లిం పాదయాత్రను చేపట్టాడు. తన స్వగ్రామం నుండి 800 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యను చేరుకోవడానికి ఆయన పాదయాత్ర ప్రారంభించాడు. 

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని చంద్‌ఖురి గ్రామానికి చెందిన మహ్మద్ ఫైజ్ ఖాన్ శ్రీరాముడి భక్తుడు. తన స్వగ్రామం నుండి అయోధ్యకు చేరుకొనేందుకు ఆయన పాదయాత్ర చేపట్టాడు. రాముడి తల్లి కౌసల్యదేవి జన్మించిన గ్రామం కూడ చంద్ ఖురి కావడం గమనార్హం.

మహ్మద్ ఫైజ్ ఖాన్ కు ఆలయాలను సందర్శించడం కొత్తేం కాదు. గతంలో 1500 కి.మీ. దూరం ప్రయాణం చేసి దేవాలయాల వద్దే ఉన్నాడు. దేవాలయాలు, ఆశ్రమాల్లో ఆయన గడిపాడు. 

తాను ముస్లింనే కానీ, మా పూర్వీకులు హిందువులు అని ఆయన చెప్పారు. పాకిస్తాన్ జాతీయ క‌వి అల్లామా ఇక్బాల్.. రాముడిని భారత దేశానికే దేవునిగా పేర్కొన్నారు. అందుకే నా భ‌క్తి కొద్దీ కౌశ‌ల్యా జ‌న్మ‌స్థ‌ల‌మైన‌ చంద్‌ఖురి నుంచి అయోధ్య‌కు మ‌ట్టి తీసుకెళ్తున్నానని  అని తెలిపారు. 

ఆగష్టు 5 వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరుకొన్నాడు. భూమి పూజ కార్యక్రమం జరిగే రోజు వరకు తాను అయోధ్యను చేరుకొంటానని ఆయన ధీమాను వ్యక్తం చేశాడు.

click me!