మళ్లీ నోరు జారీన యోగి: ముస్లిం లీగ్‌ను వైరస్ అన్న యూపీ సీఎం

Siva Kodati |  
Published : Apr 05, 2019, 02:13 PM IST
మళ్లీ నోరు జారీన యోగి: ముస్లిం లీగ్‌ను వైరస్ అన్న యూపీ సీఎం

సారాంశం

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ముస్లిం లీగ్ ఓ ప్రాణాంతక వైరస్ అని అది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సోకిందని ఆయన ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ కనుక గెలిస్తే.. ఆ వైరస్ దేశమంతా వ్యాపిస్తుందని ఆయన ట్వీట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ ముస్లిం లీగ్ ఓ వైరస్.. అది సోకిన వారెవ్వరూ బతకరు.. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పారర్టీ కాంగ్రెస్‌కు ఆ వైరస్ సోకింది. వాళ్లు గెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.. ఈ వైరస్ దేశమంతటా వ్యాపిస్తుందని ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?