కేరళలో ఆదర్శం: హిందూ యువతికి పెళ్లి చేసిన ముస్లిం దంపతులు

By narsimha lodeFirst Published Feb 21, 2020, 10:38 AM IST
Highlights

రాజేశ్వరికి ముస్లిం దంపతులు పెళ్లి చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తిరువనంతపురం: ఓ హిందూ యువతికి ముస్లిం కుటుంబం గుడిలో పెళ్లి జరిపించింది.ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది. ఇటీవలనే మసీదులో హిందూ జంటకు ఓ ముస్లిం కుటుంబం పెళ్లి జరిపించిన విషయం తెలిసిందే. 

కేరళ రాష్ట్రంలోని కున్నరియమ్‌కు చెందిన శరవణన్‌ అనే రైతుకూలీ కూతురు రాజేశ్వరి. అబ్దుల్లా అనే ముస్లిం ఇంట్లో పనిచేసేవాడు శరవణన్. దీంతో రాజేశ్వరీ కూడ అబ్దుల్లా కుటుంబంలో సభ్యురాలిగా పెరిగింది.

ఇటీవలే మసీదులో ఒక హిందూ జంట పెళ్లి జరిపించి లౌకిక తత్వాన్ని చాటుకుంది కేరళ. ఇప్పుడు మళ్లీ అలాంటి వేడుకతో మానవత్వానికీ ప్రతీకగా నిలిచింది. కేరళలోని కున్నరియమ్‌ పట్టణానికి చెందిన అబ్దుల్లా కుటుంబం రాజేశ్వరి అనే హిందూ అమ్మాయికి విష్ణు అనే అబ్బాయితో గుడిలో పెళ్లి జరిపించింది.

అబ్దుల్లా ఇంట్లో, అతని తోటలో పనిచేసేవాడు శరవణన్‌. దాంతో చిన్నప్పటినుంచీ రాజేశ్వరికీ అబ్దుల్లా కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. రాజేశ్వరికి తల్లి లేదు. దీంతో తండ్రితో రోజూ అబ్దుల్లా ఇంటికి వెళ్లేది. అక్కడే ఉన్న అబ్దుల్లా పిల్లలతో ఆడుకొనేది. తల్లి లేని రాజేశ్వరికి మరో విషాదం వెంటాడింది. శరవణన్ కూడ అనారోగ్యంతో మృతి చెందాడు.

శరవణన్ మృతి చెందిన సమయానికి రాజేశ్వరి వయస్సు ఏడేళ్లు.  ఈ సమయంలో శరవణన్ కూతురు రాజేశ్వరిని అబ్దుల్లా కుటుంబం పెంచింది. తమ ముగ్గురు పిల్లలతో పాటే రాజేశ్వరిని పెంచారు ఆ దంపతులు.

 రాజేశ్వరిని అదే గ్రామానికి చెందిన విష్ణు అనే  యువకుడు ప్రేమించాడు. ఈ  విషయం రాజేశ్వరిని పెంచిన అబ్దుల్లా  దంపతులకు తెలిసింది. రాజేశ్వరిని పెంచిన అబ్దుల్లా దంపతులు విష్ణు ఇంటికి వెళ్లి ఈ విషయమై మాట్లాడారు. రాజేశ్వరి తమ ఇంటి కోడలుగా స్వీకరించేందుకు విష్ణు తల్లిదండ్రులు కూడ అంగీకరించారు. అయితే పెళ్లి మాత్రం గుడిలోనే చేయాలని విష్ణు తల్లిదండ్రులు  షరతు పెట్టారు. దీనికి అబ్దుల్లా కుటుంబం కూడ అంగీకరించింది.

కాసరగోడ్ లోని మన్యొట్టు దేవాలయాన్ని పెళ్లి చేసేందుకు వేదికగా ఎంపిక చేసుకొన్నారు.  ఈ గుడిలో అన్ని మతాల వారికి ప్రవేశం ఉంటుంది. పెళ్లికి ఒక్క రోజు ముందే విష్ణు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అమ్మాయి తరపు వారికి స్వాగతం పలికారు. 

పెళ్లి తంతును దూరంగా నిలబడి చూస్తున్న అబ్దుల్లా దంపతులను పెళ్లి కొడుకు తరపు కుటుంబసభ్యులు వేదికపైకి తీసుకొచ్చారు. అమ్మాయి పక్కన నిలబెట్టారు.  కొత్త జంటతో  పాటు అబ్దుల్లా దంపతులను నిలబెట్టి పెళ్లికి వచ్చిన వారు ఫోటోలు దిగారు. 

click me!