భజరంగీ హత్య: రూ.10 కోట్లు ఇచ్చిన రాజకీయ నాయకుడు.. సునీల్ చెప్పింది కట్టుకథే

First Published Jul 14, 2018, 12:22 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పట్‌ జైలులో గ్యాంగ్‌స్టార్ మున్నా భజరంగీ దారుణ హత్యకు సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను భజరంగీ లావుగా ఉన్నాడని హేళన చేయడం వల్లే అతన్ని హత్య చేశానని సునీల్ రాతి చెప్పడం పెద్ద కట్టుకథ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది

ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పట్‌ జైలులో గ్యాంగ్‌స్టార్ మున్నా భజరంగీ దారుణ హత్యకు సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను భజరంగీ లావుగా ఉన్నాడని హేళన చేయడం వల్లే అతన్ని హత్య చేశానని సునీల్ రాతి చెప్పడం పెద్ద కట్టుకథ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మున్నాని హత్య చేయడానికి తూర్పు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు పది కోట్ల సుపారీ అందించినట్లు తేలిందన్నారు..

భజరంగీ హత్యకు ముందురోజు జౌన్‌పూర్‌లోని రెండు బ్యాంకుల్లో 10 కోట్లు డిపాజిట్ అయినట్లు తాము గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. తన భర్తకు ప్రాణాపాయం ఉందని మున్నా భార్య సీమా సింగ్ నిర్వహించిన మీడియా సమావేశంలో అతని పేరు చెప్పారని.. ఆ రాజకీయ నాయకుడు కూడా గతంలో ఓ గ్యాంగ్‌స్టరేనని... అతనికి.. మున్నాతో పాతకక్షలు ఉన్నాయని. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆ నేత భజరంగీపై కక్ష పెంచుకుని మున్నాని హత్య చేయించినట్లుగా తెలుస్తోందన్నారు.

మరోవైపు భజరంగీ హత్య అనంతరం సుఫారీ ఇచ్చిన వారితో సునీల్ రాతీ జైలు నుంచే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జైల్లోకి తుపాకీ, మొబైల్ ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు బృందం ఆధారాలు సేకరిస్తోందని పోలీసులు తెలిపారు.. కేసు తీవ్రత దృష్ట్యా సునీల్ రాతీని భాగ్‌పట్ జైలు నుంచచి ఫతేఘర్ జైలుకు తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

click me!