పక్కింటివారి వేధింపులు.. కొడుకుతో సహా 12 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి...

By AN TeluguFirst Published Jun 23, 2021, 2:04 PM IST
Highlights

ఓ మహిళ ఏడేళ్ల కొడుకుతో సహా 12 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కారణం రాసిన లెటర్ రూంలో వదిలింది. దర్యాప్తులో భాగంగా ఆ లెటర్ కనుగొన్న పోలీసులు పక్కింటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనలో వివరాలిలా ఉన్నాయి. 

ఓ మహిళ ఏడేళ్ల కొడుకుతో సహా 12 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కారణం రాసిన లెటర్ రూంలో వదిలింది. దర్యాప్తులో భాగంగా ఆ లెటర్ కనుగొన్న పోలీసులు పక్కింటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనలో వివరాలిలా ఉన్నాయి. 

రేష్మా ట్రెంచిల్ అనే మహిళ తన ఏడేళ్ల కొడుకుతో ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తుంది. ఆమె భర్త శరత్ ములుకుట్ల మే 23న కరోనాతో మరణించాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వారిని చూసుకోవడాని.. వారు ఉంటున్న శరత్ ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసికి వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు తల్లిదండ్రులిద్దరూ కరోనాతో మరణించారు. 

ఈ క్రమంలో శరత్ కు కూడా కరోనా సోకింది. దీంతో అతడు కూడా మే 23న మరణించాడు. ఇలా భర్త, అత్తామామలు వెంటవెంటనే చనిపోవడంతో రేష్మా ఒంటరిగా కొడుకుతో ఉంటోంది. మానసికంగా చాలా కృంగిపోయింది. ఇంత విషాదాన్ని మోస్తున్న ఆమెను ఓదార్చాల్సింది పోయి.. పక్కింటివారు వేధింపులకు పాల్పడ్డారు.

ఆమె కొడుకు అల్లరి భరించలేకపోతున్నామని, పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తున్నాడని.. అతడిని అదుపులో పెట్టాలని.. ఆమె మీద పక్క ఫ్లాట్ లో ఉంటున్న అయూబ్ ఖాన్ అనే 67యేళ్ల వ్యక్తి, అతడి 60యేళ్ల భార్య, సాహెబ్ అనే 33 యేళ్ల అతని కుమారుడు గొడవకు దిగారు. అంతేకాదు పెద్దగా గొడవచేస్తూ పరుష పదజాలంతో ఆమెను పదే పదే తిట్టారు. అసలే మానసికంగా బాధలో ఉన్న ఆమె...ఈ గొడవలతో మరింత కృంగిపోయింది.

ఎటు చూసినా నిరాశే కనిపించడంతో.. డిప్రెషన్ నుంచి తేరుకోలేక.. కొడుకుతో కలిసి సోమవారం 12 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె ఓ లేఖను కూడా రాసి తన గదిలో పెట్టింది. తన ఆత్మహత్యకు పక్క ఫ్లాట్ వాళ్లే కారణమని పేరు కూడా రాసింది. 

దీన్ని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 33 యేళ్ల సాహెబ్ ను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలోనే మరణించిన తల్లీకొడుకుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

click me!