పెళ్లయిన కాసేపటికి.. వరుడి చెంపపగలగొట్టిన వధువు.. ట్విస్ట్ ఏంటంటే...

Published : Jun 23, 2021, 11:44 AM IST
పెళ్లయిన కాసేపటికి.. వరుడి చెంపపగలగొట్టిన వధువు.. ట్విస్ట్ ఏంటంటే...

సారాంశం

అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుని మంటపం నుంచి బయల్దేరి అత్తింటికి వెళ్లిన వధువు, అత్తగారింట్లో అడుగుపెట్టకముందే అందరికీ షాక్ ఇచ్చింది. అత్తగారింటి వాకిట్లోనే అందరూ చూస్తుండగానే వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత ఎంచక్కా ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకుని.. పుట్టింటికి వెళ్లిపోయింది. 

పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోవద్దు కానీ.. చేసుకున్న తరువాత దారుణాలకు పాల్పడడం ఇటీవల మామూలైపోయింది. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

లక్నోలో తాజాగా తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుని మంటపం నుంచి బయల్దేరి అత్తింటికి వెళ్లిన వధువు, అత్తగారింట్లో అడుగుపెట్టకముందే అందరికీ షాక్ ఇచ్చింది. అత్తగారింటి వాకిట్లోనే అందరూ చూస్తుండగానే వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత ఎంచక్కా ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకుని.. పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఈ విషయం ఊరంత పాకడంతో పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్ లోని లవయాన్ గ్రామంలో చోటు చేసుకుంది. వివాహం సందర్భంగా వరుడి తరఫు బంధువులంతా పెళ్లి కుమార్తె ఇంటి చేరుకున్నారు. 

అంగరంగవైభవంగా, చాలా సందడిగా పెళ్ళి తంతు పూర్తయ్యింది. ఆ తర్వాత కొత్త దంపతులిద్దరూ కారులో పెళ్లి కుమారుడి ఇంటికి బయల్దేరింది. కార్లోంచి కిందికి దిగి.. అత్తింట్లో అడుగు పెట్టడానికి ముందు వధువు,  అందరూ చూస్తుండగా తన భర్త చెంప చెళ్లుమనిపించింది. ఈ ఊహించని ఘటనకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. 

దీన్నుంచి తేరుకునే లోపే కొత్త పెళ్లి కూతురు లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుని..చక్కగా పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఈ వార్త ఊరంతా పొక్కింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు వధువు ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో వివాదం కాస్త ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో తేలిన విషయాలు వారికి షాక్ కి గురి చేశాయి. వధువు ప్రేమ వ్యవహారం కారణంగానే వరుడి చెంప చెళ్లు మనిపించిందని తేలింది. ఇష్టం లేకపోతే ముందే చేసుకోకుండా ఉండాల్సింది కదా, ఇలా అంతా అయ్యాక వరుడికి షాక్ ఇవ్వడం ఏంటీ అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted