తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద పెట్టుకొని..

Published : Nov 23, 2020, 09:43 AM IST
తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద పెట్టుకొని..

సారాంశం

విసిగిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లారు.

ఓ మహిళ చనిపోయిన తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద పెట్టుకొని.. దానితోనే జీవిస్తోంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదరు మహిళకు మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబయి సమీపంలోని చూయిమ్ గ్రామానికి చెందిన మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఇంటి ముందు ఉన్న రోడ్డుపై చెత్త, వ్యర్థపదార్థాలు పడేసేది. ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేది కాదు. దీంతో.. విసిగిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్న ఆమెను చూసి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో మంచం కింద  మనిషి శరీరం బెడ్‌షీట్‌లో కప్పబడినట్లుగా వారికి కనిపించింది.

వెంటనే బెడ్‌షీట్‌ను లాగగా ఎముకల గూడు బయటపడింది. ఆ అస్తిపంజరం సదరు మతిస్థితిమితం లేని మహిళ తల్లి ఇవాన్‌ ఫెర్నాండజ్‌కు చెందినదిగా విచారణలో తేలింది. అస్తిపంజరాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం తరలించారు. అయితే ఇవాన్‌ ఫెర్నాండజ్‌ ఎలా మరణించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu