లిఫ్ట్‌ ప్రమాదం.. మధ్యలో ఇరుక్కుని ప్రాణాలు వదిలిన టీచర్.. డోర్లు ఓపెన్ ఉండగానే కదిలిన లిఫ్ట్

Published : Sep 18, 2022, 02:34 PM IST
లిఫ్ట్‌ ప్రమాదం.. మధ్యలో ఇరుక్కుని ప్రాణాలు వదిలిన టీచర్.. డోర్లు ఓపెన్ ఉండగానే కదిలిన లిఫ్ట్

సారాంశం

ముంబయిలో ఓ లిఫ్ట్ ప్రమాదంలో 26 ఏళ్ల టీచర్ మరణించారు. డోర్లు ఓపెన్ ఉండగానే లిఫ్ట్ పైనకు కదిలింది. అప్పుడు అందులో అడుగుపెడుతున్న ఆ టీచర్‌ను పైనకు లాక్కెళ్లిపోయింది. దీంతో ఆమె లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయింది.  

ముంబయి: మహారాష్ట్రలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ లిఫ్ట్ ప్రమాదంలో టీచర్ ప్రాణాలు వదిలింది. ముంబయిలోని మలడ్ స్కూల్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గతేడాది పెళ్లి చేసుకున్న ఆ టీచర్.. తన భర్తతో కాలం గడపడానికి ప్లాన్ చేసుకుంది. కానీ, ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం కలచివేసింది. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం ఏమైనా ఉన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

26 ఏళ్ల ఫెర్నాండేజ్ మలడ్ వెస్ట్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీస్ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా చేస్తున్నారు. ఆరో ఫ్లోర్‌లో మధ్యాహ్నం 1 గంటలకు ఆమె తన క్లాస్ పూర్తి చేసుకున్నారు. రెండో ఫ్లోర్‌లోని టీచర్స్ రూమ్‌కు రావడానికి బయల్దేరారు. కానీ, ఆమె లిఫ్ట్ క్యాబినెట్ వెళ్లగానే సడన్‌గా లిఫ్ట్ పైకి వెళ్లడం ప్రారంభించింది. ఆ లిఫ్ట్ డోర్లు ఓపెన్ ఉన్నప్పటికీ ఆ లిఫ్ట్ పైకి మూవ్ అయింది. ఫెర్నాండేజ్‌ను ఆ లిఫ్ట్‌ పైనకు లాక్కెళ్లినట్టయింది. దీంతో ఆమె పూర్తిగా లిఫ్ట్‌లోకి ఎక్కకుండానే స్టక్ అయిపోయింది. సహాయం కోసం ఆమె కేకలు వేసింది. స్టాఫ్ వెంటనే ఆమెను కాపాడటానికి పరుగెత్తుకు వచ్చారు. ఆమెను బయటకు లాగడానికి స్టాఫ్ ప్రయత్నించింది.

ఆమె అప్పటికే తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే లైఫ్‌లైన్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆమె అప్పటికే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను లిఫ్ట్‌లోని సర్వెలెన్స్ కెమెరాలు రికార్డ్ చేశాయి. 

ఫెర్నాండేజ్ వాఘోలిలోని నలసొపారలో జీవిస్తున్నారు. ఆమె గతేడాది పెళ్లి చేసుకుంది ఆమె భర్త అబ్రాడ్‌లో మర్చంట్ షిప్‌లో జాబ్ చేస్తున్నారు. ఆయన కొన్ని వారాలపాటు సెలవు పెట్టి ఇండియాకు వచ్చారు. భర్తతో గడపడానికి ఫెర్నాండేజ్ కూడా సెలవులు ప్లాన్ చేసుకున్నారు. కానీ, హఠాత్తుగా ఈ దుర్ఘటన జరగడంతో భర్త సహా ఆమె కుటుంబం దిగ్భ్రాంతిలో మునిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్