ముంబైపై మాకు హక్కుంది, కేంద్ర ప్రాంతంగా చేయాలి: ఉద్దవ్ ఠాక్రేకు కర్ణాటక డిప్యూటీ సీఎం

By narsimha lodeFirst Published Jan 28, 2021, 2:07 PM IST
Highlights

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం విషయమై  రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సృష్టించింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ  సీఎం లక్ష్మణ్ సవాడి కౌంటరిచ్చారు.

బెంగుళూరు:కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం విషయమై  రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సృష్టించింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ  సీఎం లక్ష్మణ్ సవాడి కౌంటరిచ్చారు.

కర్ణాటక సరిహద్దుల్లో మరాఠి మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఉద్దవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గురువారం నాడు కర్ణాటక డీప్యూటీ సీఎం కౌంటరిచ్చారు.

కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలను కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి తీవ్రంగా ఖండించారు. మా రాష్ట్రంలో కొంతమంది ప్రజలు ముంబై-కర్ణాటక ప్రాంతానికి చెందినవారేనని ఆయన చెప్పారు. ముంబైపై తమకు కూడా హక్కుందన్నారు. ఈ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలని ఆయన కోరారు. అప్పటివరకు ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

click me!