మహా రాజకీయం..శివసేన భవన్‌పై బాల్‌థాకరే, ఇందిరాగాంధీల పోస్టర్

By telugu teamFirst Published Nov 28, 2019, 7:55 AM IST
Highlights

 ఈ పోస్టరు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది. బాల్ థాకరే, ఇందిరాగాంధీలు ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ ఉన్న చిత్రాన్ని శివసేన నాయకులు పోస్టరుపై ముద్రించారు. 

మహా రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ అధికారం చేపట్టినంత సేపు పట్టలేదు. కేవలం మూడు రోజుల్లో మళ్లీ ఆ అధికారాన్ని శివసేన దక్కించుకుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో బాల్ థాకరే, ఇందిరాగాంధీలతో కూడిన ఫోటోతో కూడిన పోస్టరు ముంబయి నగరంలోని శివసేన భవన్‌పై వెలసింది.

 ఈ పోస్టరు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది. బాల్ థాకరే, ఇందిరాగాంధీలు ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ ఉన్న చిత్రాన్ని శివసేన నాయకులు పోస్టరుపై ముద్రించారు. ఈ పోస్టరుపై ‘‘బాలాసాహెబ్ థాకరే కల నెరివేరింది...శివసైనికుడు సీఎం అవుతున్నారు’’ అంటూ ముద్రించారు. 

బాలథాకరే పలుసార్లు ఇందిరాగాంధీ విధానాలకు మద్ధతు ప్రకటించారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని విపక్షపార్టీలు వ్యతిరేకించినా, బాలథాకరే మాత్రం మద్ధతు ఇచ్చారు. 1966లో మహారాష్ట్రలోని మరాఠీ ప్రజల అభ్యున్నతి కోసం ప్రారంభమైన శివసేన అభ్యర్థి ఇన్నేళ్ల తర్వాత సీఎం అవుతున్నారు. మొత్తంమీద శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయిక మహారాష్ట్రలో నూతన రాజకీయానికి తెర లేచింది.
 

click me!