చెన్నై విజయం.. ముంబయి పోలీసులు ఏం చేశారంటే..!

Published : May 31, 2023, 11:47 AM IST
 చెన్నై విజయం.. ముంబయి పోలీసులు ఏం చేశారంటే..!

సారాంశం

 తాజాగా చెన్నై విజయంపై ముంబయి పోలీసులు స్పెషల్  విషెస్ తెలియజేశారు. MS ధోని తన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ధరించిన చిత్రాన్ని డిపార్ట్‌మెంట్ షేర్ చేసింది.  

చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్ చేరింది. వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన సీఎస్‌కే, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్‌గా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, ఫైనల్ మ్యాచ్‌లో 214 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలింగ్ ఫెయిల్యూర్‌తో దాన్ని కాపాడుకోలేక.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.. 

చెన్నై అద్భుతమైన విజయంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ధోనీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, తాజాగా చెన్నై విజయంపై ముంబయి పోలీసులు స్పెషల్  విషెస్ తెలియజేశారు. MS ధోని తన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ధరించిన చిత్రాన్ని డిపార్ట్‌మెంట్ షేర్ చేసింది.


MS ధోని తన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ధరించిన చిత్రాన్ని డిపార్ట్‌మెంట్ షేర్ చేసింది. “ఆపండి, ఆలోచించండి & ఆపై ఒక కదలికను చేయండి. ఛాంపియన్‌లు ఎల్లప్పుడూ నిబంధనల ప్రకారం ఆడతారు & సిగ్నల్‌ను ఎప్పటికీ కోల్పోరు, ”అని క్యాప్షన్  పెట్టడం విశేషం.


పోస్ట్‌కి 21 వేలకు పైగా లైక్‌లు, అనేక  కామెంట్స్ రావడం విశేషం. నెటిజన్లు సైతం ధోనీ ని ప్రశంసలు, అభినందనలు కురిపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?